Close

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 28/08/2025

గురువారం నరసాపురం మండలం తూర్పు తాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తొలుత పీహెచ్సీలోని మందులు, ల్యాబ్, స్టాప్ రూమును, పలు విభాగాలను తనిఖీ చేశారు. హాస్పటల్ ను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని సూచించారు. ఓపి రికార్డులతో పాటు సిబ్బంది హాజరు పట్టి పరిశీలించారు. పీహెచ్సీకి సంబంధించి ఎంతమంది పనిచేస్తున్నారు. ఫీల్డ్ కి ఎంతమంది వెళ్లారు. ఇక్కడ ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు పలు వివరాలను మెడికల్ ఆఫీసర్ ని అడిగి తెలుసుకున్నారు. టిబి, హెచ్ఐవి, ఫీవర్ సర్వే, సీజనల్ వ్యాధులు గురించి మరియు పి హెచ్ సి పరిధిలో గర్భిణీ స్త్రీలు వివరాలు వారిలో రక్తహీనత తో బాధపడే వారు ఎవరైనా ఉన్నారా వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్ కు వచ్చిన రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇక్కడ మీకు వైద్య సేవలు బాగున్నాయా సదుపాయాలు ఎలా ఉన్నాయి. డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా, మీకు అవసరమైన మందులు ఇస్తున్నారా అని పలు విషయాలను అడిగారు. పీహెచ్సీ పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీల ఆరోగ్య తదితర వివరాల నమూనా పట్టికను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వైద్యం కొరకు వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని వారికి ఉత్తమమైన సేవలను అందించాలని అన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఉన్నందున అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. హాస్పటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వము వహించకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంలో సి.హెచ్.ఓ కె.శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్ అనిల్ కుమార్, తహసిల్దార్ ఐవివి సత్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్, స్టాఫ్ నర్స్, ఎం ఎల్ హెచ్పి, తదితరులు పాల్గొన్నారు.