• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి-ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 01/08/2025

పి4 కార్యక్రమంలో భాగంగా దిగువ పేద వర్గాల ఆర్థిక పురోగతికి పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించాలి

పి4 లో భాగంగా జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దిగువ స్థాయి పేద వర్గాల వారిని ఆర్థికంగా, బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పి4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. మార్గదర్శకులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. సమాజం ద్వారా సంపన్నులుగా ఎదిగిన వారు పేదలకు తమ వంతు సహాయం అందించడానికి ముందుకు రావాలని కోరారు. పేదరికం లేని సమాజాన్నితీర్చి దిద్దాలని ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో 1,700 మంది మార్గదర్శకులు రిజిస్టర్ చేసుకొని 35 వేల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది అన్నారు. జిల్లాలోని సంపన్న వర్గాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవతా దృక్పథంతో, సేవాభావంతో పేదలను ఆదుకునేందుకు ముందుంటారనే మంచి పేరు ఉందని, అదేవిధంగా ప్రభుత్వ పి 4 లక్ష్యసాధనకు తమ వంతు సహకారం అందించాలని ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశ్రమల యాజమాన్యాలను కోరారు. మార్గదర్శకులుగా నమోదైన వారు బంగారు కుటుంబాల వారికి కేవలం ఆర్థిక సహకారమే కాకుండా వారి అవసరత మేరకు విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి సహకారం అందించవచ్చు అన్నారు. బంగారు కుటుంబాల అవసరాలపై ప్రస్తుతం సర్వే జరుగుతోందని సర్వే అనంతరం సంబంధిత డేటా వెబ్ సైట్ లో పొందుపరచడం జరుగుతుందని దానిని బట్టి మార్గదర్శకులుగా రిజిస్టర్ చేసుకుని ఆయా బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థిక పురోగతికి సహాయపడాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి4లో అందరూ భాగస్వాములై పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండేవిధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, పారిశ్రామిక రంగం నుండి స్వచ్ఛందంగా మార్గదర్శకులుగా నమోదై బంగారు కుటుంబాలకు అండగా నిలవాలని ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు స్పందిస్తూ పి4 లక్ష్యాన్ని తమ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేవిధంగా కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, సిపిఓ కంటిపూడి శ్రీనివాసరావు, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ నాగలింగాచార్యులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.స్వాతి, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్, ఆనంద మెరైన్, జయలక్ష్మి సీ ఫుడ్ స్, వాన్ బర్రి వెల్కమ్ ఫిషరీస్ వివిధ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.