పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామం ఇనామ్ రికార్డులను పరిశీలించిన ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి.

పెంటపాడు మండలం తహసిల్దార్ కార్యాలయంను మంగళవారం ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసిల్దార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ ను పరిశీలించారు. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామానికి సంబంధించిన ఇనామ్ రికార్డులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మండలంలో రెవిన్యూ గ్రామమైన దర్శిపర్రు శ్రీదేవి పుంతకు చెందిన భూ స్వభావ మార్పునకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పెంటపాడు మండలంలోని ముదునూరుపాడు గ్రామంలో నెంబర్.14 ప్రభుత్వ చౌక దుకాణమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకును పరిశీలించారు .ప్రతి నెల పేదవారికి అందవలసిన నిత్యవసర సరుకులు సకాలంలో అందజేయాలని రేషన్ షాపు డీలర్ ను ఆదేశించారు. వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి నిత్యవసర సరుకులు అందజేయాలని సూచించారు.
ఈ సందర్భంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, తాహసిల్దార్ రాజరాజేశ్వరి, మండల సర్వేయర్ దీప్తి లాస్య, వీఆర్వోలు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.