పీ4 అమల్లో పశ్చిమగోదావరి జిల్లాను టాప్ లో ఉంచాలి
సరైన సమయంలో సాయం… నిరంతర మార్గనిర్దేశనం
మార్గదర్శి అంటే ఆర్థిక సహాయం ఒక్కటే కాదు, అన్ని విషయాల్లో మార్గదర్శక నిలవడం
ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి పీ4 అద్భుతమైన వేదిక
బంగారు కుటుంబాలకు బాసటగా నిలిచేలా మార్గదర్శి లను త్వరితగతిన గుర్తించాలి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పీ4 స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.
సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిఫోర్ అమల్లో భాగంగా మార్గదర్శిల గుర్తింపుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పేదల బతుకుల్లో వెలుగును నింపేలా పీ4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందనీ పీ4 స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గించేలా పీ4 విధానం అమలు చేస్తున్నాంమన్నారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 7 వేల బంగారు కుటుంబాలను గుర్తించాలన్నారు. అలాగే ఆగస్టు 15 నాటికి 15 వేల మంది మార్గదర్శులను గుర్తించేలా లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలన్నారు. ఇక పీ4 బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చే మార్గదర్శులు పాత్రపై మరింత అవగాహన కల్పించాలన్నారు. బంగారు కుటుంబాలు అన్ని అంశాల్లో సాధికారత సాధించేలా.. వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా మార్గదర్శులు గైడ్ చేస్తూ ఉండాలి. అవసరమైన సమయంలో సాయంతోపాటు, నిరంతర మార్గనిర్దేశనం చేసేలా మార్గదర్శులు ఉండాలన్నారు. దత్తత తీసుకున్న పేద కుటుంబాలకు నిరంతరం గైడెన్స్ ఇచ్చే మార్గదర్శులను గుర్తించాలన్నారు. వివిధ నియోజకవర్గాల పరిధిలో ఉండే ఎన్ఆర్ఐలు, వివిధ పరిశ్రమలు, ధనవంతులు ఎవరో గమనించాలన్నారు. వివిధ రూపాల్లో పేదలకు సేవలు అందించే వారిని గుర్తించాలని తెలిపారు. ఇలాంటి వారందరిని పీ4 వేదిక మీదకు తీసుకురావాలి కలెక్టర్ తెలిపారు.
ప్రజల్లోకి వెళ్లడానికి… మంచి పేరు తెచ్చుకోవడానికి వేదిక పీ4
మంచి పేరు కోసం పేదలకు సేవ చేసే వారు ఉన్నారు. ఆర్థికంగా సాయం చేసే వారున్నారు. వీళ్లని గుర్తించాలి. అలాగే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రజా ప్రతినిధులకూ పీ4 అద్భుతమైన వేదిక. ప్రతి నియోజకవర్గంలోనూ 7, 8 వేల పేద కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంపిక కానున్నాయన్నారు. ప్రజా ప్రతినిధులకు ఇది మంచి అవకాశం అన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు, వివిధ రంగాల్లో పనిచేసేవారు కూడా మార్గదర్శకలుగా మారాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ఎంపికైన బంగారు కుటుంబాల వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఉంటుంది స్పష్టం చేశారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం జరుగుతుందని, అలాగే ప్రతి మండలానికి ఎంపీడీవో, తహసిల్దార్ లు పర్యవేక్షకులుగా ఉంటారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆర్థికంగా బలమైన వ్యక్తులు కలిగిన జిల్లా గా పేరు గడిచిందని, రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి వరుసలో ఉండేందుకు అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, సిపిఓ కె.శ్రీనివాసరావు, డ్వామా పిడి డాక్టర్ కే సి హెచ్ అప్పారావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.