పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మండల సర్వేలను ఆదేశించారు
జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పి జి ఆర్ ఎస్ లో వచ్చిన దరఖాస్తులు పెండింగ్, జాయింట్ ఎల్ పి ఎం ఎస్ సంబంధించిన పురోగతిపై బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి, డివిజన్ మరియు మండల సర్వేలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి శ్రద్ధ పెట్టి పనిచేయాలని సర్వే అధికారులును ఆదేశించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి అర్జీదారుడుతో మాట్లాడి అర్జీల పై మళ్లీ పునఃసమీక్ష చేయాలని అన్నారు. తల్లికి వందనం అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాలు జాయింట్ ఎల్ పి ఎం ఎస్ వలన ఆగి ఉంటే సంబంధిత పట్టాదారులు గ్రామ సచివాలయం లేక మీసేవ కేంద్రములలో ఆన్లైన్ సబ్ డివిజన్ అప్లై చేయుటకు ప్రతి రీసర్వే పూర్తి అయిన గ్రామంలో డ్రైవ్ జరపబడుతుందని అన్నారు. సర్వేకు సంబంధించి నామ మాత్రపు ఫీజు రూ.50/- చలానా చెల్లించాలని ఆయన అన్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా సర్వే ఇన్చార్జ్ అధికారి కె.శ్రీనివాసరావు, డివిజన్ సర్వే అధికారులు జి.మల్లికార్జునరావు, కె.నాగభూషణం, కె.కరుణ కుమార్, మండల సర్వేలు, తదితరులు పాల్గొన్నారు.