పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

బుధవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా సమావేశమై, డివిజన్, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వెబ్ ఎక్స్ ద్వారా పి జి ఆర్ ఎస్ పిటీషన్లు పరిష్కారంపై శాఖల వారి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు నెలల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు నుండి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు అనిపిస్తుందని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు అన్నారు. పిజిఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులపై జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి క్షేత్రస్థాయి అధికారులకు తెలియపరిచిన స్పందన అంతంత మాత్రం గానే ఉంటుందనే విషయం నా దృష్టికి వచ్చిందని, ఇది సరైనది కాదని, అందరూ సమిష్టిగా పనిచేస్తేనే జిల్లా అన్ని అంశాల్లో ముందంజలో ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్ కి వెళ్లి అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తగు సూచనలు తెలియజేసి సమస్యలు వేగవంతంగా పరిష్కార చర్యలు తీసుకోవచ్చు అన్నారు. కొన్ని శాఖల్లో ఫిర్యాదులు ఎక్కువ శాతం పెండింగ్ ఉన్నాయని వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అధికారి ఒక అరగంట సమయం ఫిర్యాదుల పరిష్కారానికి కేటాయించాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదు దారుని సంప్రదించి నిర్ణీత గడువులోగా సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ ,వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి.డా.కె సిహెచ్ అప్పారావు, డి పి ఓ కె.అరుణ శ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, సిపిఓ కె.శ్రీనివాసరావు, ఐసిడిఎస్ పిడి బి.సుజాత రాణి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి.గణపతిరావు, గృహ నిర్మాణ శాఖ ఇఇ జి.పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.