• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పిఫోర్ మార్గదర్శి అంటే డబ్బున్న వారు కాదు.. మార్గదర్శి అంటే మనసున్న వారు

Publish Date : 05/08/2025

వివిధ వ్యక్తులు చేస్తున్న సేవలను ఒకే తాటిపైకి తీసుకువచ్చే లక్ష్యమే పిఫోర్

పోర్టర్ లో రిజిస్టర్ చేసుకునే వారికి ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి

… ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

డిఆర్డిఏ, డ్వామా శాఖల ద్వారా ప్రేరేపితులై ముందుకు వచ్చిన పి4 మార్గదర్శిలతో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వివిధ మార్గాలు ద్వారా సేవలు అందిస్తున్న సమాజ నిర్దేశకులు అందరిని ఒకే తాటిపై తీసుకువచ్చి మార్గదర్శకులుగా నమోదు చేసి బంగారు కుటుంబాలకు సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం పిఫోర్ ను కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. “మార్గదర్శి అంటే డబ్బులు ఉన్నవారు కాదని .. మనసున్న వారిని” ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత ఆరువారాల నుండి పి ఫోర్ పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్నవారికి బంగారు కుటుంబాలుగా నామకరణ చేసి, సేవా హస్తం అందించే వారిని మార్గదర్శిలుగా పిలవడం జరుగుతుందన్నారు. సమాజంలో మార్పు కోసం ఎంతో సేవ చేయాల్సి ఉందన్నారు. సమాజ సేవలో వచ్చే ఆనందం మాటలలో చెప్పలేనిదన్నారు. చట్ట ప్రకారం మీ సేవలను అందించేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మీకు కావాల్సిన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు. మార్గదర్శకులుగా నమోదు కావడానికి మనసున్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. మార్గదర్శకులుగా http://zeropovertyp4.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు కావాలని సూచించారు. నమోదు అయ్యే సందర్భంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టి తీసుకురావాలన్నారు. ప్రతి సచివాలయంలో నమోదుకు ఉచితంగా అవకాశం కల్పించామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్గదర్శిగా వివిధ రకాల సేవలను అందించవచ్చని, ఆర్థికంగా ఒక్కటే కాదని, సేవా తత్పరతతో చేసే ఏ కార్యక్రమం అయినా నిర్వహించవచ్చు అన్నారు. ఒక సారి వెబ్ సైట్ లోని సేవలను పరిశీలిస్తే ఏ సేవలను మీరు ఎంచుకోవచ్చునో అవగాహన వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

వివిధ మార్గాల ద్వారా సేవలు అందిస్తున్న ఆయా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వారి వారి సేవలను సభాముఖంగా అందరికీ వివరించారు.

ఈ సమావేశంలో సిపిఓ కె.శ్రీనివాసరావు, డ్వామా పిడి డాక్టర్ కే సి హెచ్ అప్పారావు, డిఆర్డిఏ డిపిఎం కె.శ్రీనివాస్, వసుధ ఫౌండేషన్, శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ సేవా సమితి, బై రాజు ఫౌండేషన్, రోటరీ క్లబ్, రవి సోషల్ సర్వీసెస్ సొసైటీ, కిషోర్ చారిటబుల్ ట్రస్ట్, సెయింట్ జోన్స్ వెల్ఫేర్ సొసైటీ, ఆదరణ చారిటబుల్ ట్రస్ట్, లైన్స్ క్లబ్, రాహుల్ సోషల్ సర్వీసెస్, మానవతా ట్రస్ట్, తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.