• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

Publish Date : 01/09/2025

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువలోపున పరిష్కారం చూపాలి.

అర్జీలు రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి.

.. జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.

సోమవారం జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈసందర్బంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజలనుంచి 210 అర్జీలు అందాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయు తంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే మంచి పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.

ఈరోజు పిజిఆర్ఎస్ కు అందిన ఫిర్యాదులలో ముఖ్యమైనవి కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

@. కాళ్ల మండలం మండలం, పెదఅమిరం గ్రామానికి చెందిన తాళ్లపూడి గోవింద అర్జీని సమర్పిస్తూ, తన కుమారుడు పుట్టుకతోనే మానసిక, శారీరక వికలాంగుడనని, ఇప్పటివరకు రూ.6 వేలు పింఛను పొందుతున్నారన్నారు. మంచం మీదనే కదలలేని లేని స్థితిలో ఉన్న నా కుమారునకు 15 వేల రూపాయల పింఛను మంజూరు చేయాలని కోరారు.

@ వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామానికి చెందిన సాయి బుజ్జి బాబు దరఖాస్తు సమర్పిస్తూ, తనకు 30 సెంట్లు భూమి ఉందని, గత సంవత్సరం తన భూమిని ఆన్లైన్ చేసి, పాస్ బుక్ ఇప్పించాలని కోరానని, ఇప్పటివరకు నా సమస్య పరిష్కారం కాలేదని, దయచేసి నా భూమిని ఆన్లైన్ చేసి పాస్ బుక్ ఇప్పించాలని కోరారు.

@ భీమవరానికి చెందిన బావిశెట్టి వీర వెంకట సత్యనారాయణ అర్జీని సమర్పిస్తూ, తాను క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నానాని 15 లక్షల రూపాయలు ఖర్చు అయిందని, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి 1,75, 000 వేల రూపాయలు మాత్రమే మంజూరు అయ్యా అన్నారు. ప్రస్తుతం తాను ఎటువంటి పని చేయలేని పరిస్థితిలో ఉన్నానని, దయచేసి తనకు పింఛను మంజూరు చేయాలని కోరారు.

@ భీమవరం మండలం రాయలం నివాసి మానుకొండ సంపూర్ణమ్మ అర్జీని సమర్పిస్తూ, తాను, నా కుమార్తె స్వంత ఇంటిలో నివాసం ఉంటున్నామని, నా కుమారుడు నన్ను మోసం చేసి ఇల్లు రాయించుకుని ఇంటి నుంచి వెళ్లి పొమ్మంటున్నాడన్నారు. దయచేసి నా ఇల్లు నాకు తిరిగి వ్రాయించి తనకు రక్షణ కల్పించాలని కోరారు.

@ భీమవరం మండలం, యనమదుర్రు కాలవ గట్టు నివాసి ఈనకొండ భవాని,తన భర్త చనిపోయారని, తనకు ఇద్దరు కుమారులని జీవనాధారం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని తనకు వితంతు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

ఐ గాట్ కర్మయోగి, ఈపిడిఎస్ ఫైల్స్ అప్లోడింగ్ పై సమీక్ష

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈ పి టి ఎస్ ఫైల్స్ అప్లోడింగ్ అంశంపై సమీక్షిస్తూ జిల్లాలోని తహసిల్దార్లు, ఎంపీడీవోలు తమ కార్యాలయాలలోని జీవోలు, ప్రొసీడింగ్స్, సర్కులర్లు, ఫైల్స్ ఈ పి టి ఎస్ పోర్టల్ లో అప్లోడ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా మండల వారి అప్లోడింగ్ ప్రగతిపై సమీక్షించారు.

. ఐగాట్ కర్మయోగి అంశంపై శాఖల వారి సమీక్షిస్తూ ఇది ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించు ఆన్లైన్ శిక్షణ వేదికని, ఉద్యోగులు పనిచేసే శాఖకు ఉపయోగపడే ఎన్నో విలువైన కోర్సులు ఈ పోర్టల్ లో ఉన్నాయని వాటిలో శాఖపరమైన కోర్సులు ఎంపిక చేసుకొని నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కోర్స్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. శాఖాధిపతులందరూ తమ కార్యాలయాల్లోని సిబ్బంది అందరితో కోర్సులలో శిక్షణ పొందే విధంగా శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో వయోవృద్ధుల ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.