పిజిఆర్ఎస్ అర్జీలకు నిర్ణీత గడువులోపుగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరము నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీదార్లవద్ద నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులు స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో సమావేశమై మాట్లాడుతూ నిర్ణీత గడవులోపుగా ఫిర్యాదులను పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని, అధికారులు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కరించాల్సిందేనని గట్టిగా చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో కొందరు అధికారులు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సమస్యను పరిష్కరించడం అంటే మీ పైన కూడా పని భారాన్ని తగ్గించుకున్నట్లేనని, సరైన పరిష్కారం చూపకపోతే రెట్టింపు పని భారం పెరుగుతుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. అవసరమైతే అధికారులే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవా అవాస్తవాలను బేరీజు వేసుకుని చక్కని పరిష్కారాన్ని చూపించాలని, పరిష్కారం కానీ సమస్యలు ఉంటే అర్జీదారానికి ఏ కారణం చేత సమస్యను పరిష్కారం చేయలేకపోతున్నామో అర్థమయ్యేలా వివరించి సమాధానపరచాలన్నారు.
జిల్లాలో రెడ్ క్రాస్ మెంబర్ షిప్ లను సాధ్యమైనంత ఎక్కువగా చేయడానికి జిల్లా, మండల స్థాయి అధికారులు కృషి చేయాలన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో మెంబర్షిప్ చేరికల సంఖ్య చాలా తక్కువగా ఉందని, కొన్ని మండలాల్లో ప్రారంభమే కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవోలు, తహాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ఈ నిధులు ద్వారానే ఎన్నో కార్యక్రమాలను రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తుందని గుర్తించుకోవాలన్నారు. కొన్ని జిల్లా కార్యాలయాలు కూడా మెంబర్షిప్ ల నమోదులో చాలా తక్కువుగా ఉన్నారన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీ కి అవసరమైన రక్తాన్ని సేకరించేందుకు ప్రతి కార్యాలయంలోని ఉద్యోగస్తుల ద్వారా రక్తదాన కార్యక్రమాలను నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించి అందజేయడం జరిగిందని, నిర్ణీత గడుపు ప్రకారం రక్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ రక్తం బదులుగా రక్తం తీసుకోకుండానే అవసరమైన వారికి రక్తాన్ని నేరుగా అందజేస్తుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. చాలామందికి సరైన సమయంలో రక్తం దొరక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈరోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా 279 అర్జీలను స్వీకరించడం జరిగినది. వాటిలో కొన్ని ఎలా ఉన్నాయి…
@ నరసాపురం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచి కూనపురెడ్డి వీర వెంకట విజయ రంగారావు అర్జీని అందజేస్తూ తనకు 2.20 సెంట్లు భూమి ఉందని, నా ల్యాండ్ కన్వర్షన్ ఆన్లైన్ కొరకు పలుసార్లు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, అతని భూమిని అడంగల్ లో నమోదుకు కోరడమైనది.
@ భీమవరం మండలం కొత్త పూసలమర్రుకు చెందిన కొల్లాటి ధర్మరాజు అర్జీని సమర్పిస్తూ, గ్రామపంచాయతీకి 05 ఎకరాల చెరువు ఉందని, బొడ్డు బాలకృష్ణ పంచాయితీ చెరువును వేలంపాటలో పాడుకుని చేపలు పట్టుకుని పాట సొమ్మును గ్రామపంచాయతీకి జమ చేయలేదని, సొమ్ము పంచాయితీకి జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
@ భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన నౌతల రమాదేవి తన ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పు కోసం పలు పర్యాయాలు అధికారులు చుట్టూ తిరుగుతున్న చర్యలు తీసుకోలేదని, నా స్కూల్ సర్టిఫికెట్ ఆధారంగా నా ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చవలసిందిగా అర్జీ సమర్పించారు.
@ పాలకోడేరు మండలం విస్సా కోడేరు గ్రామానికి చెందిన కండవల్లి మేరీ తనుకు ఇంటి స్థలం మంజూరు చేశారని ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నానని కానీ ఇంటికి వెళ్లే మార్గం లేదని, కావున ఇంటికి దారి చూపించాలని కోరారు.
@ గణపవరం మండలం దాసుళ్ల కుమాధవల్లి గ్రామానికి చెందిన కంకిపాటి చిన్నబాబు అర్జీని సమర్పిస్తూ, నా తల్లి పేరును 27 సెంట్లు వ్యవసాయం ఉందని, 2023 సంత్సరములో నా తల్లి నా పేరున రాశారని, వెబ్లాండ్ నందు కనిపిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయడంలేదని తెలిపారు
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పి.డి డా.కె.సి.హెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితర్లు పాల్గొన్నారు.