పాలిటెక్నిక్ కోర్స్ ఎంపికలో యశస్విని ఆదర్శంగా తీసుకోవాలి ..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కాళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు చదివి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 586 మార్కులను సాధించిన నిమ్మల యశస్విని ప్రత్యేకంగా అభినందించారు. ఏం చదవాలి అనుకుంటున్నావు అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించిన సందర్భంలో నేను పోలి సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నానని, పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్, ఐటిఐ కోర్సులు పూర్తి చేసుకున్న వెంటనే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందించారు. టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు కోర్స్ ల ఎంపికలో యశస్విని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మంచి ఫలితాల సాధనకు విద్యార్థులను ప్రోత్సహించినందుకు ప్రధానోపాధ్యాయు జెఎల్ఎం శాస్త్రి కి జిల్లా కలెక్టర్ శాలువా కప్పి అభినందించారు.
ఈ సందర్భంలో డిఇఓ ఇ.నారాయణ, ఎంఈఓ ఏ.రవీంద్ర, ప్రధానోపాధ్యాయులు జెఎల్ఎం శాస్త్రి, యశస్విని తల్లిదండ్రులు నిమ్మల శ్రీనివాసరావు, భారతి, తదితరులు ఉన్నారు.