పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేలా ఉద్యమ్ (Udyam) వర్క్ షాపులు నిర్వహించాలి.
పరిశ్రమల స్థాపనకు అందిన ధరఖాస్తులకు నిర్ణీత గడువులోపుగా అనుమతులను మంజూరు చేయాలి.
…. జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.
జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది.
ముందుగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా పరిశ్రమల అధికారి యు.మంగపతి రావు తీసుకున్న చర్యలను నివేదించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ ర్యాంపు పథకం అనేది సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీని ముఖ్య ఉద్దేశం ఎంఎస్ఎంఈ ల స్థాయిని పెంచడం అన్నారు. జిల్లాలో ఈ పథకం అమలకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఉద్యమ్ నమోదు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఆన్లైన్ ఆధారత విధానం అన్నారు. ఉద్యమ్ వర్క్ షాప్ ద్వారా ఉద్యమ్ నమోదుపై అవగాహన కల్పించడం, ఎంఎస్ఎంఇ ల ప్రయోజనాలు వివరించడం అన్నారు. వర్క్ షాప్ లు ఉపయోగకరంగా, ఫలప్రదంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ఉద్యమ్ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో కీలకమైనవని వీటిపై అవగాహన, నిపుణులకు శిక్షణ, లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే విధంగా ఈ వర్క్ షాప్ లు నిర్వహించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు జిల్లాలో సెప్టెంబర్ నెలాఖరు నాటికి 28 ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ లు నిర్వహించాలన్నారు. ప్రతి మండలంలో వర్క్ షాపు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి తనకు నివేదిక సమర్పించాలన్నారు. జిల్లా స్థాయి నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు యూనిట్ల స్థాపన, పారిశ్రామిక పెట్టు బడులపై అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లాలో పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్షిస్తూ జులై 25వ తేదీ నుండి ఇప్పటివరకు వివిధ శాఖల అనుమతుల కోసం 359 ధరఖాస్తులు అందగా 313 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, మరో 46 ధరఖాస్తులు పరిష్కరించవలసి ఉందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సాహం ఎం ఎస్ ఎం ఈ వివిధ రాయితీ పాలసీ కింద 9 యూనిట్లకు 9,62,207 లక్షల రూపాయలు మంజూరుకు అనుమతించడం జరిగిందన్నారు. పిఎంఈజీపి పథకం 2025-26 కింద యూనిట్ల స్థాపనకు 69 దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగిందని, 136 యూనిట్లు స్థాపించడం జరిగిందని, మిగిలినవి కూడా త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవలని సంబంధిత సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EODB)అంశంపై మాట్లాడుతూ భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు (EODB ) ర్యాంకులు ఇవ్వడానికి సర్వే నిర్వహిస్తోందని జిల్లా నుండి వివిధ శాఖల ద్వారా 2628 మంది యూజర్స్ ఉన్నారని, వారు ఈ సర్వేలో స్పందన మేరకు ర్యాంకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ సర్వేలో ప్రశ్నావళి పై యూజర్స్ ఏ విధంగా స్పందించాలో సంబంధిత శాఖలు, వారికి అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఆన్లైన్ ద్వారానే పూర్తి చేసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో కె పి ఎం జి కన్సల్టెంట్ సౌమ్య, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి.రామాంజనేయరాజు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు కె.ఎస్.ఎన్ ప్రసాదు, లీడ్ బ్యాంకు మేనేజరు ఏ.నాగేంద్ర ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ వ్యాపార సంస్థల పేర్లు తదితరులు పాల్గొన్నారు.