పాడి రైతులకు సబ్సిడీపై సమీకృత పశు దాణా పంపిణీ జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి
శనివారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం గ్రామ సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు అందిస్తున్న 50 శాతం సబ్సిడీ సమీకృత దాణా పంపిణీ కార్యక్రమంను జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా కలిసి 18 మంది పాడి రైతులకు దాణా బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెల్లరేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమీకృత దాణా పొందేందుకు పాడి రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకుని 50 శాతం సబ్సిడీపై పశుసమీకృత దాణా పొందవచ్చునని అన్నారు. పశువులకు ఈ దాణా పెట్టటం వలన పాల ఉత్పత్తి పెరిగి ఆర్థికంగా లాభము పొందవచ్చునని అన్నారు. 50 కేజీల బస్తా ధర రూ.1,110 కాగా సబ్సిడీపై .రూ.555 పొందవచ్చునని అన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంది శాఖ అధికారులు, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.