పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి అన్నారు
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలలో పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమంను శనివారం భీమవరం మండలం చిన్నఅమీరం జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించారు. ఈ ముస్తాబు కార్యక్రమంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. క్లాస్ రూములు పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్తాబు కార్యక్రమంను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది అన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటించలన్నారు. ఇంటి వద్ద బయలుదేరినప్పుడు నీటిగా తయారయ్యి స్కూలుకి రావాలన్నారు. శుభ్రమైన యూనిఫామ్, పాదరక్షలు వేసుకుని రావాలన్నారు. గోళ్ళు కత్తిరించుకుని, తల దువ్వుకుని, ముఖము శుభ్రము చేసుకొని రావాలన్నారు. అలాగే స్కూలు నుండి ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అంత శుభ్రముగా వెళ్లాలని పిల్లలకు సూచించారు. ప్రతి విద్యార్థి తల, చేతులు, వేసుకున్న దుస్తులు శుభ్రముగా ఉన్నాయా, లేవా అని పాఠశాలకు వచ్చి పరిశీలించుకోవాలని అన్నారు. సరిగా లేనివారు తరగతి గదిలో ఏర్పాటు చేసిన అద్దం, దువ్వానా, పౌడరు, నెయిల్ కట్టర్ వంటి వాటిని ఉపయోగించి శుభ్రముగా తయారవ్వాలన్నారు. టాయిలెట్ కి వెళ్లి వచ్చాక, భోజనానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి అన్నారు. పరిశుభ్రమైన, సురక్షితమైన నీళ్లే తాగాలని సూచించారు. మగ పిల్లలు ఇష్టం వచ్చినట్టు జుట్టు పెంచకూడదని అన్నారు. వయసు వచ్చిన బాలికలు తగిన శుభ్రత పద్ధతులను నేర్చుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో ఒక ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేసి అద్దం, దువ్వెన, నెయిల్ కట్టర్, టవల్, సబ్బు, హ్యాండ్ వాష్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి క్లాస్ రూమ్ కి ఇద్దరు లీడర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. వీరు వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలస్తారని అన్నారు. పిల్లలకు రోజు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటుగా మార్చడం, నిరంతరం పాఠశాలకు వచ్చేలా చూడటం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపు, పాఠశాలలు వసతి గృహాలు శుభ్రంగా సురక్షితంగా పిల్లలు అనుకూల వాతావరణం కల్పించడం, తదితర అంశాలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్భంగా వివరించారు. ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ కి రాహుల్ కుమార్ రెడ్డి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన తెలిపే గోడపత్రికను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. వాల్ పోస్టర్లు ప్రతి తరగతి గది ముందు అతికించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సీఎం ఓ వై.చంద్రశేఖర్, ఎంఈఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.