పశ్చిమ గోదావరి జిల్లాలో స్టేట్ రివ్యూ మిషన్ (SRM) బృందం పర్యటన
పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన నిమిత్తం ఎస్.ఆర్.ఎం (SRM) ప్రత్యేక బృందం ఈరోజు నుండి నవంబర్ 28 తేదీ వరకు జిల్లాలో పర్యటించనుంది.
ఈ సందర్భంగా జి. నరసింహ నాయక్ , సి హెచ్ శిరీష మరియు జి. ప్రసన్న కుమార్ ప్రతినిధి బృందం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. ఏం రవిబాబు మరియు సంబంధిత అధికారులు తో ప్రత్యేకంగా సమావేశమై ఈ క్రింద సూచించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
మాతా శిశు సంరక్షణ (MCH): గర్భిణీ స్త్రీల నమోదు, యాంటీ నేటల్ చెకప్స్ (ANC), హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల గుర్తింపు, ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల పెరుగుదల మరియు జనని సురక్ష యోజన (JSY) నిధుల చెల్లింపులపై రికార్డులను తనిఖీ చేస్తారు.
సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలు (Immunization): చిన్నారులు మరియు గర్భిణీలకు వేయాల్సిన టీకాల లక్ష్యాలు, కోల్డ్ చైన్ నిర్వహణ (Cold Chain Maintenance) మరియు యు-విన్ (U-WIN) పోర్టల్‌లో వివరాల నమోదును పరిశీలిస్తారు.
Bullet ఫ్యామిలీ డాక్టర్ విధానం & ఆయుష్మాన్ భారత్: గ్రామీణ ప్రాంతాలలో ఫ్యామిలీ డాక్టర్ పర్యటనలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల పనితీరు మరియు రోగులకు అందుతున్న ఉచిత వైద్య పరీక్షల నాణ్యతను తెలుసుకుంటారు.
అసంక్రమిత వ్యాధుల నియంత్రణ (NCD): 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ రక్తపోటు (BP), మధుమేహం (Diabetes), మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ, మందుల పంపిణీ తీరును సమీక్షిస్తారు .
సీజనల్ మరియు కీటక జనిత వ్యాధులు: డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఫీవర్ సర్వేలు, మరియు లార్వా నియంత్రణ కార్యక్రమాలను పరిశీలించారు.
Bullet క్షయ (TB) మరియు కుష్టు వ్యాధుల నిర్మూలన: టీబీ రోగుల గుర్తింపు, వారికి అందుతున్న పోషకాహార భృతి (నిక్షయ్ పోషణ్ యోజన) మరియు చికిత్స వివరాలను తనిఖీ చేస్తారు.
మరియు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు పనితీరును సమీక్షిస్తారు.
జిల్లాలోని రూట్ మ్యాప్ ప్రకారం
వారు ఎంచుకున్న ఏరియా ఆసుపత్రి , అర్బన్ హెల్త్ సెంటర్స్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, అక్కడ అందుతున్న సేవలు మరియు మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు డా వి. ప్రసాద్ , డా సేవా సుధారాణి , డా రత్న కిషోర్, మరియు సుభాష్ తదితరులు పాల్గొన్నారు.