Close

పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు.

Publish Date : 28/02/2025

గురువారం భీమవరం పట్టణంలోని పిఎస్ఎమ్ బాలికల ఉన్నత పాఠశాలను, వీరవాసరంలోని ఎం ఆర్ కే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఓటర్లుతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడు డివిజన్ ల్లో ఆర్డీఓలు నోడల్ అధికారులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 93 పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. మూడు డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను భీమవరం కలెక్టరేట్లో అప్పగించుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం పోలింగు బాక్సులను ఏలూరు జిల్లాలోని ఏలూరులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములకు తరలించడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడమైనదన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్లు, తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. మార్చి మూడో తేదీన ఏలూరు జిల్లా ఏలూరు నందు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలో 20 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం తహసీల్దార్ రావి రాంబాబు, వీరవాసరం తహసిల్దార్ రామాంజనేయులు, తదితరులు ఉన్నారు.

1.111.22