పశ్చిమగోదావరి జిల్లా విద్యా శాఖ మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలో 2వ స్థానము, విద్యార్ధుల అభ్యసన సామర్థ్యాలలో 5వ స్థానములో నిలిచాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన డిసెంబర్ 11, 12 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు నందు అన్ని జిల్లాల విద్యాశాఖల పనితీరును సమీక్షించి, వివిధ అంశాల్లో జిల్లాల వారిగా ర్యాంకింగ్ ను ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లా విద్యా శాఖ మౌలిక సదుపాయాల కల్పనకు రాస్ట్రంలో 2వ స్థానము, విద్యార్ధుల అభ్యసన సామర్థ్యాలలో 5వ స్థానములో వున్నవని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భయముగా జిల్లా విద్యా శాఖాధికారి, సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి, ఉప విద్యాశాఖాధికారులను, మండల విద్యాశాఖాధికారులను, ఉపాద్యాయులను అభినందించడం జరిగింది. విద్యాశాఖ మరింత కృషి చేసి జిల్లాను రాష్ట్రములో మొదటి స్థానములో నిలిపేందుకు శ్రమించాలన్నారు. అపార్ ఐడి నమోదులో కూడా రాష్ట్రములో మన జిల్లా 3వ స్థానములో ఉందని తెలిపారు. ప్రభుత్వము ఇటీవల ప్రకటించిన స్టార్ రేటింగ్స్ నందు స్కూల్ ఇన్ఫ్రా కేటగిరి నందు 1,375 పాఠశాలలకు గాను అత్యధిక పాఠశాలలు 432 పాఠశాలలు ఫోర్ స్టార్ రేటింగ్, 698 త్రీ స్టార్ రేటింగ్ పొందాయని తెలిపారు. ఆదేవిధముగా అకాడమిక్ కేటగిరి నందు 196 పాఠశాలలు త్రీ స్టార్ రేటింగ్, 772 పాఠశాలలు టూ స్టార్ రేటింగ్ కలిగి వున్నాయని తెలిపారు.