Close

పశ్చిమగోదావరి జిల్లా డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు ను కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల..

Publish Date : 19/08/2025

అభినందనలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది…

డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు ను కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు.

భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ పబ్లిక్ గ్నెవెన్సెస్ మరియు పెన్షన్లు సిబ్బంది & శిక్షణ విభాగం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ చౌరాసియా మొగిలి వెంకటేశ్వర్లు ను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రకటిస్తూ ఆగస్టు 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నిబంధనలలోని నియమం 8(1) ద్వారా ఇవ్వబడిన నిబంధనలు 1954 అధికారాలను వినియోగించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు 2023 సెలక్షన్ లిస్ట్ కు ప్రమోషన్ ద్వారా నియామకం చేపట్టడం జరిగింది నోటిఫికేషన్ లో ప్రకటించారు.

మొగిలి వెంకటేశ్వర్లు పూర్వం గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా పెట్టూరివారిపాలెం నందు 1976 మే 20 జన్మించినారు. 1996 అక్టోబర్ 17న వ్యవసాయ శాఖలో సబార్డినేట్ సర్వీస్ లో ఉద్యోగంలో జాయిన్ అయిన వీరు, 2002లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీస్ కు సెలెక్ట్ అయ్యి ఏపీ సెక్రటేరియట్లో టిసీఏ గా నియామకం కాబడ్డారు. అనంతరం 2004లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా, 2008 నుండి 2011 వరకు ఇంధన శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పదోన్నతిపై పనిచేశారు. 2011లో డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొంది, 2014 నుండి 2019 వరకు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు. అనంతరం 2019లో తాడేపల్లి లోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నందు జాయింట్ సెక్రటరీగా పని చేశారు. 2019 జులై నుండి 2020 మార్చి వరకు నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారిగా, 2020 ఏప్రిల్ నుండి 2023 సెప్టెంబర్ వరకు, 2023 అక్టోబర్ నుండి 2024 ఫిబ్రవరి వరకు, 2024 ఫిబ్రవరి నుండి 2024 అక్టోబర్ వరకు కృష్ణా, ఏలూరు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేశారు. అనంతరం 2024 అక్టోబర్ నుండి పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ ఈ నెల ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు కన్ఫర్డ్ ఐఏఎస్ గా పదోన్నతి పొందారు.

పశ్చిమగోదావరి జిల్లా డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లుకు కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ లు, డివిజన్, మండల, గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు అభినందనలు తెలిపారు.