పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలి.. సైకిల్ వినియోగానికి, నడకకు ప్రాధాన్యతను ఇవ్వాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

“స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమం సందర్భంగా రేపు మూడో శనివారం జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలి..
“స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా రేపు 19వ తేదీ 3వ శనివారం “క్లీన్ ఎయిర్” స్వచ్ఛ గాలి థీమ్ తో కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుండి స్వచ్ఛ్ ఆంధ్ర….స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం “క్లీన్ఎయిర్” పై నిర్వహించవలసిన కార్యక్రమాలపై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలుతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం ప్రజల ఆరోగ్యం పై ఎటువంటి దుష్ప్రభావం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు సైకిల్ ఎక్కువగా వినియోగించేలా అవగాహన కల్పించేందుకు శనివారం ప్రతి మండలంలో సైకిల్ ర్యాలీలు నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టాలన్నారు. అదేవిధంగా ప్రతిరోజు నడక వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమల యూనిట్లలో వాతావరణం కలుషితం కాకుండా తీసుకోవలసిన చర్యలపై ఆ యాజమాన్యాలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యర్థ పదార్థాలను కాల్చడం ద్వారా వాతావరణం కలుషితమవుతుందన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సోలార్ యూనిట్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కట్టెల పోయి స్థానంలో ఎల్పిజి వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. దీపావళి రోజున వాతావరణం కాలుష్యం కానీ క్రాకర్స్ ను మాత్రమే వాడాలని సూచించారు. నియోజకవర్గం ప్రత్యేక అధికారులు కూడా స్థానిక శాసనసభ్యులను ఆహ్వానించి క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగస్వాములనుచేసి ర్యాలీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు.
ఈ గూగుల్ మీట్లో సిపిఓ కె.శ్రీనివాసరావు, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, డిఎంహెచ్వో జి.గీతా బాయి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.