పరిశ్రమల స్థాపనకు అందిన ధరఖాస్తులకు నిర్ణీత గడువులోపుగా అనుమతులను మంజూరు చేయాలి.

పరిశ్రమల స్థాపనకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు వినియోగించుకోవాలి.
..జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
గురువారం జిల్లా కలెక్టరేటు వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది.
తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా పరిశ్రమల అధికారి తీసుకున్న చర్యలను సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు యూనిట్ల స్థాపన, పారిశ్రామిక పెట్టు బడులపై అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారికి ఆర్థిక ప్రాత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. అసంఘటిత కార్మికులు అందరిని పిఎంజెజెబివై, పి.యం.ఎస్.బి.వై భీమా పథకాలను నమోదు చేసేందుకు సంబంధిత అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ 9552300009 ద్వారా పరిశ్రమలకు సంబంధించి అందుబాటులో వున్న సేవలను వినియోగించుకునేందుకు హోర్డింగ్స్, బ్యానర్స్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో మే 27 నుండి ఇప్పటివరకు వివిధ శాఖల అనుమతుల కోసం 465 ధరఖాస్తులు అందగా, వాటిలో 458 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, మరో 7 ధరఖాస్తులు పరిష్కరించవలసి ఉందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సాహం ఎం.ఎస్.ఎం.ఈ వివిధ రాయితీ పాలసీ కింద 24 యూనిట్లకు 49.93 లక్షల రూపాయలు మంజూరుకు అనుమతించడం జరిగిందన్నారు. పిఎంఈజీపి పథకం కింద యూనిట్ల స్థాపనకు 568 దరఖాస్తులను బ్యాంకులకు పంపడం జరిగిందని, 342 యూనిట్లు స్థాపించడం జరిగిందని, మిగిలినవి కూడా త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజరు ఏ.నాగేంద్ర ప్రసాద్, అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు కె.ఎస్.ఎన్ ప్రసాదు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, జిల్లా విద్యుత్తు శాఖ అధికారి ఏ.రఘునాథ బాబు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆర్ వి ఎస్ వి ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.స్వాతి, ఎ పి ఎస్ ఎఫ్ సి డి.అపర్ణ, ఎఫ్ ఎ పి ఎస్ ఐ ఎ మెంబర్ కె.సత్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.