పది రోజుల్లో వాట్సాప్ ద్వారా 50 శాతం సేవలు అందించేలా చర్యలు-ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు
ఇప్పటివరకు జిల్లాలో రెండు వేలు వాట్సప్ అప్లికేషన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్స్అప్ గవర్నెన్స్ గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు నిర్వహించి విస్తృతంగా అవగాహన కల్పించాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మంగళవారం అత్తిలి గ్రామంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అత్తిలి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద నుండి అత్తిలి మెయిన్ సెంటర్ వరకు వాట్సప్ గవర్నెన్స్ అవగాహన పై భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమమునకు ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమమును నేటి నుండి జిల్లాలో ప్రజలలో వాట్సప్ గవర్నెన్స్ పై విస్తృతంగా అవగాహన కల్పించి మరింత సేవలను అందించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 535 గ్రామ సచివాలయాల్లో ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు అవగాహన కల్పించుటకు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 550 సర్వీసులను ప్రజలు పొందవచ్చునని అన్నారు. పేపర్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా డిజిటల్ గవర్నెన్స్ సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రజలకు వారి చేతుల్లో ఉన్న ఫోన్ ద్వారా వాట్స్అప్ సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రెవిన్యూ, మున్సిపల్, పంచాయతీ, తదితర శాఖలకు సంబంధించి వాట్సప్ గవర్నెన్స్ సేవలను పొందవచ్చునని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రెండు వేల అప్లికేషనులు వాట్స్అప్ ద్వారా రావడం జరిగిందని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 50 శాతం వాట్సప్ సేవలను పూర్తి చేయాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కె.మురళీకృష్ణ, తహసిల్దార్ వంశీ, ఇన్చార్జి ఎంపీడీవో, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.