Close

పదవ తరగతి పరీక్షల నిర్వహణను ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పూర్తిచేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Publish Date : 17/03/2025

సోమ‌వారం నుంచి ప్రారంభమైన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వహణను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం పట్టణంలోని శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోత్సవ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తొలుత త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప‌రిశీలించి, జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో వెలుతురుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యార్ధులతో మాట్లాడుతూ పరీక్షలు వ్రాసేటప్పుడు ఏ విధమైన ఒత్తిడికి గురికాకుండడా ప్రశాంతముగా ఉండాలని, అప్పుడే పరీక్షలు బాగా రాయగలుగుతారని సూచించారు. విద్యార్ధుల‌కు ఏర్పాటు చేసిన త్రాగునీరు, ఇత‌ర వ‌సతుల‌ను ప‌రిశీలించారు. వైద్య‌శిబిరాన్ని సంద‌ర్శించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్ధుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి, అవ‌స‌ర‌మైన మందుల‌ను అంద‌జేయాల‌ని సిబ్బందిని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డిఇఓను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 128 పరీక్షా కేంద్రాలలో 24,393 మంది విద్యార్థులు ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలకు నేటి నుండి హాజరు అవుతున్నారు. మార్చి 17న జరిగిన ప్రథమ భాషతెలుగు పరీక్షకు 22,692 మంది విద్యార్థులకు గాను 22091 మంది విద్యార్థులు హాజరు కాగా 601 మంది విద్యార్థులు గైర్హాజరైనారనీ, హాజరు శాతం 97.35% గా ఉందన్నారు. అలాగే హిందీ పరీక్షకు ఇద్దరు విద్యార్థులకు గాను నూరు శాతం హాజరయ్యారని తెలిపారు. ఈ రోజు ఫ్లయింగ్ స్క్వాడ్ 46 పరీక్షా కేంద్రములు, జిల్లా స్థాయి పరిశీలకులు 04 పరీక్షా కేంద్రములు, జిల్లా విద్యాశాఖాధికారి వారు 05 పరీక్షా కేంద్రములు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ 04 పరీక్షా కేంద్రములు మొత్తం 60 పరీక్షా కేంద్రములను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ రోజు పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీటింగ్ సదుపాయము, త్రాగు నీరు, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, ఫస్ట్ ఎయిడ్ సదుపాయములు ఏర్పాటు చేయడమైనదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్లు దూరంలో జిరాక్స్ సెంటర్ లు ఉదయం 9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష సమయము నందు తెరవకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. విద్యార్ధులకు పరీక్షలకు సంబందించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నెం.08816-297200 కు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు కాల్ చేయవచ్చునని తెలిపారు.

పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, డిపార్ట్మెంట్ అధికారి ఐ.వి.ఆర్ మోహన్ రావు, చీఫ్ సూపరింటెండెంట్ జె.సీతారామ మూర్తి, సంబంధిత అధికారులు ఉన్నారు.