Close

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 04/02/2026

పది ఫలితాలలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలి.

భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో పదవ తరగతి పరీక్షల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుఫై నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. పదవ తరగతిలో విద్యార్థులు విజయం సాధిస్తేనే వారికి ఉన్నత భవిష్యత్తు ఉంటుందన్నారు. పాలిటెక్నిక్, ఐటిఐ, నర్సింగ్ తదితర కోర్సులు చేయాలన్న పదవ తరగతిలో తప్పక విజయం సాధించవలసి ఉందన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కచ్చితంగా అమలు చేయాలన్నారు. పాఠశాలలకు విద్యార్థులు సక్రమంగా హాజరయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాలలలో విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు తల్లిదండ్రులు గమనించాలన్నారు. కొంత మంది విద్యార్థులకు పరీక్షలు అంటే భయం ఉంటుందని అటువంటి వారికి మనోధైర్యాన్ని కల్పించి మానసికంగా పరీక్షలు వ్రాసేందుకు సన్నద్ధం చేయాలన్నారు. 10వ తరగతి పరీక్షలు సమీపంలో ఉన్నందున పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఇప్పటికీ 60 రోజులు గడిచిపోయాయన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కూలుకు వస్తున్నారు, వారిలో ఎంతమంది రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ ఉన్నారు, ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ పరిశీలన చేశారు.

జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల పాఠశాలలకు హాజరు, సబ్జెక్టుల వారీగా ఏఏ విద్యార్థులు వెనకబడి ఉన్నారు, మండలాల వారి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా సమయం కేటాయించి మంచి బోధన అందించాలన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలలో విద్యార్థుల ప్రగతి స్థాయిని సమీక్షించారు. పాఠశాలలలో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు, విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి పెడితే నూరు శాతం మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు ఎన్.రమేష్, ఎం. మురళి సత్యనారాయణ, జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు