పంట నష్టం అంచనాకు వ్యవసాయ సిబ్బంది రాకపోతే కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలి – ఇన్చార్జి కలెక్టర్ కే.ఆర్. కల్పశ్రీ
Publish Date : 22/11/2026
ఇటీవల సంభవించిన ఆర్నాబ్, మురుసు తుఫానుల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ కే.ఆర్. కల్పశ్రీ తెలిపారు. పంట నష్టం అంచనా కోసం వ్యవసాయ సిబ్బంది తమ గ్రామాలకు రాకపోయినట్లయితే రైతులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08816299181 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆమె సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.