పంటల బీమా నమోదులో అర్హులైన రైతులందరికీ అవకాశం కల్పించాలి

Publish Date : 23/11/2026
WhatsApp Image 2026-11-23 at 7.43.11 PM

జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ (డీఎల్‌ఎంసీ) సమావేశంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

రబీ 2024–25, ఖరీఫ్ 2025 పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతుల వివరాలను ఈ-క్రాప్ నమోదుతో సరిపోల్చి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా ధ్రువీకరించాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ (డీఎల్‌ఎంసీ) సమావేశంలో ఆమె మాట్లాడుతూ, క్షేత్రస్థాయి ధ్రువీకరణ అనంతరం అర్హులైన రైతుల వివరాలను కమిటీ పరిశీలించి ఆమోదించిన తరువాత ప్రభుత్వానికి పంపించే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.

2026 పంటల బీమా సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు నమోదైన రైతుల సంఖ్య, ఇంకా నమోదు చేసుకోవాల్సిన అర్హులైన రైతుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన రైతులందరికీ పంటల బీమా పథకంలో భాగస్వామ్యం కల్పించేలా మిగిలిన నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి సునీత, వ్యవసాయ శాఖ ఏవో సామ్యూల్ జాన్సన్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

*జిల్లా సమాచార శాఖ, భీమవరం వారిచే జారీ చేయడమైనది.*