నేత్రదానం మహాదానం, ఒకరు నేత్రదానం ద్వారా ఇద్దరు అందులకు చూపు ఇవ్వవచ్చు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా పి జీఆర్ఎస్ సమావేశ మందిరం నందు సోమవారం జాతీయ నేత్రదాన పక్షోత్సవాలపై అవగాహన కరపత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. నేత్రదానం ఒక గొప్ప దానమన్నారు. దీని ద్వారా మరణానంతరం మరణించిన వ్యక్తి కళ్ళు ఇద్దరు అందుల జీవితాల్లో వెలుగు నింపవచ్చు అన్నారు. వ్యక్తి మరణానంతరం కూడా వారి కళ్ళు జీవించే ఉంటాయన్నారు. నేత్రదానంపై గ్రామ, డివిజన్, జిల్లా స్థాయిలలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నేత్రదానం చేసిన వారు మరణానంతరం మరణించిన ఆరు గంటల లోపుగా కార్నియాను సేకరించి అవసరమైన అందులకు అమర్చడం ద్వారా వారికి దృష్టిని తిరిగి ప్రసాదించవచ్చు అన్నారు. నేత్రదానాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు నేత్రదాన పక్షోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ డా.జి.గీతా బాయి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసి రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.