Close

నేడు పి జి ఆర్ ఎస్ లో 179 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 86 దరఖాస్తులు స్వీకరణ–జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 05/01/2026

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి.

అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం వారు సంతృప్తి చెందే విధంగా ఉండాలి.

సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో పాటు డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ప్రజల నుండి నేడు పీజీఆర్ఎస్ లో 179 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ ద్వారా 86 అర్జీలు స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినందున ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువు లోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యల పరిష్కారం ఉండాలన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు.

ముందుగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పి జి ఆర్ ఎస్ లో అర్జీదారులు అందించే దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను, రెవిన్యూ క్లినిక్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో అర్జీదారుల దరఖాస్తుల నమోదు, పరిష్కార చర్యలను పరిశీలించారు. జిల్లాలో రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ లో జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం జాయింట్ కలెక్టర్ పీజీఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించి సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి.

&. భీమవరం మండలం, కొవ్వాడ అన్నవారానికి చెందిన పినిశెట్టి సత్యనారాయణ అర్జీని సమర్పిస్తూ, తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని జీవనాధారం లేక చాలా ఇబ్బంది పడుతున్నానని పింఛన్ మంజూరు చేయాలని కోరారు.

&. వీరవాసరం మండలం, రాయకుదురు గ్రామానికి చెందిన మల్లుల సత్యవతి అర్జీ సమర్పిస్తూ గత 18 సంవత్సరాలు పింఛను తీసుకున్నానని, 5 సంవత్సరాల నుండి పింఛన్ రావడం లేదన్నారు.తన కొడుకు తనను చూడట్లేదని, జీవనాధారం లేక ఇబ్బంది పడుతున్నానని తిరిగి పింఛన్ మంజూరు చేయాలని కోరారు.

&. వీరవాసరం మండలం మత్స్యపురిపాలెం గ్రామానికి చెందిన ఎం.వెంకటరెడ్డి అర్జీ సమర్పిస్తూ, తనకు 0.50.1 సెంట్ల భూమి ఉందని, జాయింట్ ఎల్పిఎం 522 రీ సర్వేలో 0.99 సెంట్లుగా నమోదయిందని, మా భూమిని ఆన్లైన్లో 0. 50.1 సెంట్లుగా నమోదు చేసి జాయింట్ ఎల్ పి ఎంను వేరు చేయాలని కోరారు.

&. భీమవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన విప్పర్తి కుమారి అర్జీ సమర్పిస్తూ, తనకు టిడ్కో ఇల్లు మంజూరు అయిందని, కానీ ఇప్పటివరకు తనకు అప్పగించలేదని ఇంటిని తనకు అప్పగించాలని కోరారు.

&. పాలకోడేరు మండలం గొరగనమూడి పాలెం గ్రామానికి చెందిన కడలి భూలక్ష్మి అర్జీ సమర్పిస్తూ మా ప్రాంతంలో కోతులు బెడద ఎక్కువగా ఉందని, మనుషులపై దాడి చేస్తూ భయపెడుతున్నాయని ఇంటిలో గడియ పెట్టుకొని ఉండవలసి వస్తుందని దయచేసి కోతుల బారి నుండి రక్షించవలసిందిగా కోరారు.

&. ఇరగవరం మండలం, కె.ఇలందలపర్రుకు చెందిన క ట్టబాల వెంకట సత్యనారాయణ తాను అంగవైకల్యం, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, ప్రస్తుతం 6 వేలు పెన్షన్ తీసుకుంటున్నానని,15 వేలు రూపాయలు పెన్షన్ ఇప్పించాలని కోరారు.

ఈ సమావేశంలో వివిధ శాఖ జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.