Close

నేడు టాటా ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు పొందిన తణుకు ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాలలోని 40 మంది విద్యార్థినులు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 19/01/2026

దిక్సూచి ఉద్యోగ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన 40 మంది విద్యార్థినులు…

జిల్లా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణతో ఇప్పటికే జిల్లా అంతట ఉద్యోగ దిక్సూచి కార్యక్రమాలు…

వేలాది మంది యువత దిక్సూచి ఉద్యోగ మేళాల ద్వారా ఉద్యోగాలు సాధించిన వైనం

జిల్లాలోని యువత, విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుదలకు నేషనల్ కెరీర్ సర్వీస్ అండ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పదుల సంఖ్యలో దిక్సూచి ఉద్యోగమేళాలను నిర్వహించి ప్రముఖ కంపెనీలలో వేలాదిగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జనవరి 10వ తేదీన తణుకు ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాలలో నిర్వహించిన దిక్సూచి ఉద్యోగమేళాలో ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో ఒకేసారి 40 మంది విద్యార్థులకు చెన్నై హోసూర్ లోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ వారు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందన్నారు. నేడు 40 మంది విద్యార్థులు భీమవరం నుండి బయలుదేరి చెన్నైకి వెళ్లడం జరిగిందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపిక కాబడిన 40 మంది విద్యార్థులు సోమవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని సద్విని చేసుకుని జీవితంలో రాణించాలని సూచించారు. శిక్షణ సమయంలోనే మీకు కేటాయించినప్పటిపై క్షుణ్ణంగా నేర్చుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఆకాంక్షించారు. ఇతర వ్యాపకాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తులో సొంతంగా నిలబడేందుకు బాటలు వేసుకోవాలన్నారు. ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుందని, శిక్షణ సమయంలో రూ.16,637/- లు స్టైఫండ్, ఉచిత వసతి, ట్రాన్స్పోర్టేషన్, సేఫ్టీ షూస్ అండ్ యూనిఫామ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి జీవితం స్థిరపడాలని కోరారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వెళ్లిన చోట క్రమశిక్షణతో మెలగాలని, పనిపైనే దృష్టి ఉంచాలని సూచించారు. వేరే మార్గాలకు మళ్ళితే మీ తల్లిదండ్రులతో పాటు, జిల్లాకు కూడా చెడ్డ పేరు వస్తుందని హితవు పలికారు.

అనంతరం 40 మంది విద్యార్థినులు చెన్నై కు బస్సులో బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.లోకమాన్, ఎన్సిఎస్ యంగ్ ప్రొఫెషనల్ ఎం.కిషోర్ రెడ్డి, సిఐఐ ఎంసిసి బి.శ్రీనివాస్, ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాల సిబ్బంది జి.హరిప్రసాద్, విద్యార్థినులు, తదితరులు ఉన్నారు.