Close

నాటికలను బ్రతికించుకుందాం అని, ఉండి నియోజకవర్గంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనన్నట్లు రాష్ట్ర శాసనసభ ఉపవాసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలిపారు

Publish Date : 25/04/2025

గురువారం భీమవరం చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో కీర్తిశేషులు గోకరాజు రంగరాజు రామాయమ్మ కళావేదిక నందు దుగ్గిరాల సోమేశ్వరరావు, కొత్తపల్లి శివరామరాజు పేరిట 18వ సంవత్సర జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలను రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రముఖ సినీ నటులు రావు రమేష్, చైతన్య భారతి కార్యవర్గం సభ్యులు, తదితరులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ కళలను ఆధారించాలంటే అప్పట్లో రాజులు ఉండేవారని, ఇప్పుడూ ప్రభుత్వాలు చేస్తున్నాయని, కానీప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని,నాటక రంగానికి ప్రభుత్వం సహకారం అందించాలని అన్నారు. నాటక రంగానికి ఆదరణ తగ్గుతుందని, నాటక రంగాన్ని బ్రతికించుకుందామని అన్నారు. సినిమా ప్రపంచంలో నాటక రంగాలు కొట్టుకుపోతున్నాయని, అయిన నాటక రంగాన్ని బ్రతికిస్తూ ఇటువంటి జాతీయస్థాయి నాటక పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ డిజిటల్ యుగములో కూడా చైతన్య భారతీయ సంగీతా నృత్యం నాటక పరిషత్ వారు కళారంగం పట్ల ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈనాడు ఏర్పాటు చేసిన నాటక పోటీలను వీక్షించేందుకు ఇంతమంది రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. నాటికల వైభవాన్ని తీసుకురావడానికి ఈ పోటీలను గత 17 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు మాట్లాడుతూ నాలుగు రోజులపాటు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, ఈనెల 27 వరకు జరుగుతాయని, 4 రోజుల్లో 9 నాటికలను ప్రదరిస్తున్నామని అన్నారు. అనంతరం ప్రముఖ సినీ నటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య సత్కారం, సినీ రంగస్థలం నటులు, రచయిత మిశ్రో కు చుక్కన సత్యనారాయణ రాజు రంగస్థలం చైతన్య పురస్కారం, రంగస్థలం నటీమణి మణిబాల కు పెనుపోతుల శేషగిరిరావు చైతన్య పురస్కారాలను అందజేశారు.

అనంతరం కళానికేతన్ కట్రపాడు వారిచే “కిడ్నాప్, మైత్రి కళా నిలయం హైదరాబాద్ వారిచే బ్రహ్మ స్వరూపం నాటకాలు అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో డిఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, చిలుకూరి నరసింహరాజు, మంతెన రామ్ కుమార్ రాజు, పిఆర్వో భట్టిప్రోలు శ్రీనివాస్, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, పేరిచర్ల లక్ష్మణ వర్మ, బోండా రాంబాబు, కాట్రెడ్డి సత్యనారాయణ, కారుమూరి సత్యనారాయణ మూర్తి, పెన్నడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చైతన్య భారతి నృత్య నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, డి ఎన్ ఆర్ కళాశాల పాలకవర్గం అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహ రాజు, దండు భాస్కర రావు, చిలుకూరు నరసింహ రాజు, లయన్స్ కృష్ణ రాజు, సత్యనారాయణ మూర్తి తదితర్లు ప్రసంగిచారు.

5.11