నరసాపురం మండలం, పెద్దమైనవాని లంక గ్రామంలో మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Publish Date : 13/10/2026

నరసాపురం మండలం, పెద్దమైనవాని లంక గ్రామంలో మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సి ఎస్ ఆర్ నిధులు రూ.50 లక్షల విలువైన
7ఆటోలు, 12 మోపెడ్లు, 20 బోట్లు, మరియు వలలు 39 మంది మత్స్యకార లబ్ధిదారులకు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ కలిసి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. సముద్ర తీర ప్రాంతమైన పెద్దమైన వానిలంక మత్స్యకారులు వారి జీవితాల వెలుగు నింపింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె ఈ ఊరు ఆడబిడ్డగా వారి కష్టాలు తెలుసుకుని వారి కి ఏ విధంగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. సముద్రం కోత నివారణకు రూ 13 కోట్లతో గోడ నిర్మాణం, డిజిటల్ భవనం నిర్మాణం, ప్రతి ఇంటికి సోలార్ కాంతులు అందిస్తున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులు జీవనోపాధికి భృతి కల్పిస్తుందని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అభివృద్ధి లో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సహకారమును లబ్ధిదారులు సక్రమంగా ఉపయోగించుకుని జీవన ప్రమాణాలు పెంపొందించుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.

***జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తీర ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు తీర ప్రాంతం సముద్ర కోతకు గురి అవకుండా డిలీట్ కంపెనీతో 13 1/2 కోట్లతో ఒక కిలోమీటర్లు గోడ నిర్మించడం జరిగిందని అన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కొరకు మత్స్యకారులకు అవసరమైన వృత్తి పరికరాలు, రవాణా సదుపాయాలు అందించడం ద్వారా వారి ఉపాధిని మరింత మెరుగుపరచ వచ్చని అన్నారు. ఆటోలు, మోపెడ్లు అందుకోవడం ద్వారా చేపల రవాణా, విక్రయాలకు సౌలభ్యం కలుగుతుందని, బోట్లు, వలలు అందుకోవడం ద్వారా చేపల వేటకు అవసరమైన వనరులు సమకూరుతాయని అన్నారు.
మత్స్యకారుల సంక్షేమం, వారి జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు తమకు అందించిన వాహనాలు, బోట్లు, వలలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు.

***స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా వారి కుటుంబాలకు భరోసా కల్పించవచ్చని తెలిపారు. మత్స్యకారులు తమ వృత్తిలో మరింత అభివృద్ధి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు.
ఎస్‌బీఐ సీఎస్ఆర్ నిధుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారులకు ఉపాధి సాధనాలు అందుబాటులోకి రావడంతో వారి వృత్తి కార్యకలాపాలకు మరింత ఊతం లభించనుంది. ఇటువంటి సహాయ కార్యక్రమాలు మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల అభివృద్ధికి దోహదపడతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు ఎస్ బి ఐ రీజనల్ మేనేజర్ రామకృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి డా. డి. శ్రీనివాస్,ఎల్ డి ఎం జాన్ మార్టిన్, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, నరసాపురం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ పోత్తూరి రామరాజు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పిఆర్ఓ పేరాల మోహన్, కొవ్వలి ఎతి రాజా రామ్మోహన్ రాయుడు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు