Close

నరసాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణినరసాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 28/03/2025

రంజాన్ పర్వదినాల సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ముస్లిం సోదర, సోదరిమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసి నియోజకవర్గ ప్రజల తరఫున ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపర్ ఇండిపెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇటువంటి వేడుకలను జరుపుకోవడం సంతోషించదగిన విషయం అన్నారు. జిల్లాలోని ప్రతి ముస్లిం కుటుంబము సుఖ సంతోషాలతో, విద్య, వ్యాపార అభివృద్ధితో మెండుగా ఉండాలని జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆకాంక్షించారు.

నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లింలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. మసీదులు, బరియల్ గ్రౌండ్ లు అభివృద్ధికి తమ వంతు కృషిచేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ పధకాలు చేపడుతుందని, తప్పక వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్డివో దాసిరాజు, డీఎస్పీ శ్రీ వేద, మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య టిడిపి ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, జనసేనపార్టీ, టిడిపి పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం శ్రీమన్నారాయణ, ముస్లిం మత పెద్దలు, కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.