ధాన్యము తక్కువ ధరకు అమ్ముకోవద్దు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది.
మంగళవారం పోడూరు మండలం మట్టపర్రు గ్రామంలో పొలాలు వద్ద ఏర్పాటుచేసిన పొలం పిలుస్తుంది, ధాన్యం కొనుగోలు, సంబంధించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు పండించిన ధాన్యమును రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలన్నారు. రైతుల ఎవరు ఎం.ఎస్.పి కన్నా తక్కువ ధరకు ధాన్యము అమ్మ వద్దని, దళారులను నమ్మవద్దని, ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2,389/- సాధారణ రకానికి క్వింటాకి రూ. 2,369/- మద్దతు ధర ఉందని తెలియజేశారు. గోనె సంచులకు ఎటువంటి కొరత లేదని రైతులు అందరికీ అవసరమైన గోనె సంచులను ప్రభుత్వమే అందిస్తుంది సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు.
రైతులందరూ ఈ పంట నమోదు కార్యక్రమం త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోనులను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. డ్రోన్లుతో పిచికారి చేయడం వలన మొక్కకు సమానంగా మందు పిచికారి జరుగుతుందని సమయము డబ్బు అవుతుందని అన్నారు. రైతులు వ్యవసాయంలో నూతన పద్ధతులపై అవగాహన కల్పించుకోవాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని అన్నారు. రైతులు సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న అధికారుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భూసార ఆధారిత ఎరువులు వినియోగం పాటించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, వ్యవసాయ సహాయ సంచాలకులు పి.మురళీకృష్ణ, తహసిల్దార్ ఎస్.డి మౌలానా పాజిల్, ఎం ఏ ఓ విశ్వేశ్వరరావు, గ్రామ సర్పంచ్ దొమ్మేటి శ్రీను, వైస్ ఎంపీపీ గుబ్బల సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్ డి.రాంప్రసాద్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.