Close

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్స్ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కోరారు.

Publish Date : 26/09/2025

శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్స్ ప్రతినిధులు మరియు జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో స్థానిక భారతీయ విద్యా భవన్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ 2025-26 సంబంధించి రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైస్ మిల్లర్స్ సన్నద్ధం కావాలని అన్నారు. అక్టోబర్ 10వ తేదీ నుండి ఖరీఫ్ సీజన్ కొనుగోలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేందుకు రైస్ మిల్లర్స్ అందరూ సహకరించాలన్నారు. మిల్లర్స్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నాణ్యమైన గోనె సంచులు ఆర్ ఎస్ కే లకు పంపాలని అన్నారు. తేమ శాతంలో తేడాలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు ఎండి ఇబ్రహీం, డిఎస్ఓ ఎన్.సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఏఎస్ఓ ఎం.రవిశంకర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సామంతపూడి శ్రీరామరాజు, సెక్రటరీ కె.శ్రీనివాస్, జిల్లాలోని రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.