ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనే సంచులు అన్ని రైతు సేవ కేంద్రాల్లో అందుబాటు లో ఉన్నాయి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు
మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అత్తిలి పర్యటనలలో భాగంగా మార్గమధ్యలో ఉండి మండలం ఎండగండి గ్రామంలో రోడ్డుపై రైతులు నెట్టు కట్టిన ధాన్యం బస్తాలను, పట్టుబడికి రైతు మోటర్ బైక్ పై తీసుకెళుతున్న గోనెసంచులను చూసి ఆగి మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి గోనెసంచులు ఇబ్బంది లేకుండా అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 80 శాతం వరకు కోతలు పూర్తి అయినవని మిగిలిన 20 శాతం తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్క రైతు రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యమును విక్రయించుకోవాలని అన్నారు. మధ్య దళారులను నమ్మవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన మరుసటి రోజునే రైతు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. అధికారులు రైతులకు పూర్తి సహకారం అందించడం జరుగుతుందని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే వెంటనే అధికారులు దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున వీలైనంత మట్టికి ధాన్యం తేమ శాతం లేకుండా చూచుకోవాలని అన్నారు. మిల్లులకు ధాన్యం తరలించిన 48 గంటలు పైబడి రైతు ఖాతాలో డబ్బులు జమ కాకపోయినా మిల్లులు వద్ద ఇబ్బందులు ఏమైనా ఉన్నా అధికారులు సహకరించక పోయినా వెంటనేతన దృష్టికి తీసుకుని వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దీనీ పై రైతులు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించిన 48 గంటలు లోపు రైతు ఖాతాల్లో డబ్బులు జమ ఆవుతున్నాయని ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని జెసి వద్ద రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని లాభపడాలని అన్నారు. ఖరీఫ్ సీజను పనులు పూర్తి చేసుకుని రబీ సాగుకు సంసిద్ధులు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు.