Close

దీపం పథకం లబ్ధిదారులతో మాట్లాడి పథకం ప్రయోజనాలను వివరించిన రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్

Publish Date : 21/05/2025

లబ్ధిదారుల గృహంలో స్వయంగా టీ కాచి లబ్ధిదారులకు అందజేసి, తాను సేవించిన అజయ్ జైన్…

దీపం పథకం పేదింటి మహిళల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.

బుధవారం రాష్ట్ర పర్యాటకం, గృహ నిర్మాణం శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి దీపం పథకం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. పేద మహిళలకు ఆర్థిక ప్రయోజనం సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందని, సంవత్సరానికి మూడు సిలిండర్లను ఉచితంగా అందజేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. లబ్ధిదారుని గృహంలో స్వయంగా గ్యాస్ స్టవ్ ను వెలిగించి టీకాచి లబ్ధిదారునికి స్వయంగా అందజేయడంతో లబ్ధిదారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్పెషల్స్ సీఎస్ అజయ్ జైన్ కాచిన టీ తాగి చాలా రుచికరంగా పెట్టారని అభినందించారు.