Close

దివ్యాంగ విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, సాంకేతికంగా రాణించారు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 31/01/2026

ఇంటర్ మీడియట్లో ఉత్తీర్ణులై, సౌజ్ఞ భాష నందు ప్రావీణ్యత కలిగిన బధిర విద్యార్థులకు భీమవరం కలెక్టరేట్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఉచితంగా చరవాణిలను అందజేశారు. నిబంధనల మేరకు అర్హత కలిగిన పేద విద్యార్థులు రేషన్ కార్డు కలిగి, 18 సంవత్సరములు ఆపై వయస్సు కలిగిన, అదేవిధముగా 40% ఆపై వైకల్యము కలిగిన బధిర విభిన్న ప్రతిభావంతులైన 5 మంది విద్యార్థులకు ఒక్కొక్కటి రూ.19,000/- విలువ కలిగిన మొత్తము రు.95,000/-లు వ్యయంతో ఐదు ఆండ్రాయిడ్ ఫోనులను విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా సమకూర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ బి.రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.