దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్ కు అర్జీల సమర్పించేందుకు వస్తుంటారని, ముఖ్యంగా ప్రతి సోమవారం జరిగే పీజిఆర్ఎస్ కు వందలాదిమంది వినతి పత్రాలు సమర్పించేందుకు వస్తున్నారన్నారు. ప్రతిరోజు వివిధ మండలాల నుండి కలెక్టరేట్లో జరిగే సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు రావడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పై అంతస్థకు రావడానికి కొంతమంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధుల పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైన వారు లిఫ్ట్ వినియోగించుకోవాలని కోరారు. ఈ లిఫ్టు 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.