తీర ప్రాంతం ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలని పేరుపాలెం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున విద్యా సంస్థను నిర్మించడం గొప్ప విషయమని కేంద్ర భారీ ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు
మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామంలో గొన్నాబత్తుల వెంకటప్రసాద్, నందిని విద్యారణ్య భారతీయ విద్యా కేంద్రం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ ఇ సిలబస్ నూతన భవనం ప్రారంభోత్సవమునకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యారణ్య ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి, వినాయక విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం 2.30 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 10 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 తరగతి గదుల స్కూల్ భవనమును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. మారుమూల ప్రాంతంలో అన్ని అంగులతో ఇంత చక్కటి సదుపాయాలతో నిర్మించిన స్కూలులో మంచి క్వాలిటీతో కూడిన విద్యను పిల్లలకు నేర్పాలని టీచర్స్ తో అన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ పేరుపాలెంలో ఇంత పెద్ద ఎత్తున విద్యాసంస్థను నిర్మించి నరసాపురం ప్రాంతం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన గొన్నబత్తుల వెంకట ప్రసాద్, నందిని వారి కుటుంబ సభ్యులుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతం వాసులు కానప్పటికీ సమాజం కొరకు ఏమైనా చేయాలని భావనతో గొన్న బత్తుల వెంకటప్రసాద్ నందిని దంపతులు పేరుపాలెం లో నివాసం ఏర్పాటు చేసుకుని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టు చక్కటి విద్యాసంస్థను నిర్మించి భారత దేశంలో అనేక చోట్ల విద్య కేంద్రాలను నిర్వహిస్తున్న భారతీయ విద్యా కేంద్రం నాకు అప్పగించటం జరిగిందని కేంద్ర ఉక్కు గనుల భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు మత్స్యకారులు నివసించే మారుమూల ప్రాంతమైన పేరుపాలెం గ్రామంలో పిల్లలకు మంచి విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చి అన్ని సౌకర్యాలు తో కూడిన మంచి స్కూలును నిర్మించిన గొన్నాబత్తుల వెంకటప్రసాద్ నందిని దంపతులు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని సదుపాయాలతో నిర్మించిన చక్కటి స్కూలు లో పిల్లలకు మంచి క్వాలిటీ తో కూడిన విద్యను అందించాలని టీచర్స్ కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఈ ప్రాంతం ప్రజలు అవకాశంను సద్వినియోగం చేసుకుని పిల్లలను మంచిగా చదివించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డా.గోన్న బత్తుల వెంకటప్రసాద్, నందిని దంపతులు వారి కుటుంబ సభ్యులు గొన్న బత్తుల పునీత్, అర్చన, రక్షిత్, సాయి ప్రియ, భారతీయ విద్యా కేంద్రం. యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.