• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

తాడేపల్లిగూడెంను ఆరోగ్యవంతమైన పట్టణంగా రూపు దిద్దేందుకు శాసనసభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 01/09/2025

సోమవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి స్వయంగా చూపించడం జరిగింది. కడగట్ల 32 వ వార్డులో నిర్మాణంలో ఉన్న సెమీ ఆసియన్ స్విమ్మింగ్ పూల్, రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం, హౌసింగ్ బోర్డ్ లోని ఖాళీ స్థలం రైతు బజార్ ఏర్పాటుకు, గొల్లగూడెం చెరువు స్థలం టౌన్ హాల్ నిర్మాణానికి, శశి కాలేజీ పక్కన స్థలం క్రికెట్ స్టేడియం నిర్మాణానికి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన వాకింగ్ ట్రాక్, ఆట స్థలమును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో వారు చేపట్టిన ప్రాజెక్టులను తిరిగి ఇప్పుడు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. తాడేపల్లిగూడెం పట్టణాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలని వారి ఆకాంక్షకు జిల్లా యంత్రాంగం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. స్విమ్మింగ్ పూల్ పూర్తయితే పోటీలను కూడా నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. పట్టణంలో సోర్స్ యాక్టివిటీస్ పెంచడానికి వివిధ దాతల సహకారం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసుకోవడం సంతోషించదగిన విషయం అన్నారు.

ఈ సందర్భంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్డీవో ఖతీబ్ కౌసల్ భానో, తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్, స్థానిక జనసేన నాయకులు వర్తనపల్లి కాశి, స్థానిక నాయకులు, తదితరులు ఉన్నారు.