తణుకులో గోస్తనీ కాలువ పొంగి రహదారిపైకి చేరిన వరద నీరు పరిశీలన…..

Publish Date : 06/11/2026
WhatsApp Image 2026-11-05 at 4.00.41 PM (1)

మున్సిపల్ అధికారులు నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి…

తణుకు పట్టణంలో ఆంధ్రా షుగర్స్ ఎదురుగా ఉన్న గోస్తనీ కాలువ పొంగి వరద నీరు రహదారిపైకి చేరడంతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆమె సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రానున్న గంటల్లో మరిన్ని వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కాలువలో నీటి ప్రవాహాన్ని, రహదారిపై వరద నీటి పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయి వివరాలు, తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

కలెక్టర్ వెంట తణుకు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు….