Close

జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 02/10/2025

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఉండి మార్కెట్ యార్డ్ లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

సూపర్ జీఎస్టీ , సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉండి మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం రైతులు టాక్టర్లతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని రైతులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జిఎస్టి 2.0 తగ్గింపుకు సంబంధించి పవర్ టిల్లర్స్, ఫ్రెష్ కట్టర్స్, ఏరియేటర్లు, వెటర్నరీ మందులు ఎగ్జిబిషన్ స్టాల్ ను డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. పరికరాలకు సంబంధించి జి.ఎ.స్టి వలన ఎంత మొత్తంలో రేట్లు తగ్గుతాయి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి తదితర విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ లో వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు, వ్యవసాయానికి సంబంధించిన వివిధ పరికరాలు 12 నుండి 5 శాతానికి ప్రభుత్వం తగ్గించినందున రైతులకు, ప్రజలకు తెలిసేలా విస్తృతంగా అవగాహన ర్యాలీలను నిర్వహించాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిఎస్టి తగ్గింపు పై ప్రజలకు తెలిసేలా అధికారులు విస్తృతంగా ర్యాలీలు ప్రచారాలు నిర్వహించే ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రూ:85 లక్షల తో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ లేబరేటరీ ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు

ఉండి మార్కెట్ యార్డు ఆవరణలో నాబార్డు, ఆర్కే వి వై నిధులు రూ.85 లక్షలతో నిర్మించిన సమీకృత వ్యవసాయ పరీక్ష (IAL) కేంద్రం మరియు సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించగా, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, వ్యవసాయ సంచాలకుల చాంబర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఒక రూమును ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ వ్యవసాయం సజీవంగా సాగాలంటే వ్యవసాయానికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు ఎంతో అవసరమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉండి మార్కెట్ యార్డ్ ఆవరణలో రూ.85 లక్షల నిధులతో నిర్మించిన సమీకృత వ్యవసాయ పరీక్షా కేంద్రం రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యవసాయం సజీవంగా సాగాలంటే వ్యవసాయానికి సంబంధించిన పరీక్షలు చాలా అవసరమని గుర్తించి ఈ భవనం నిర్మించడం జరిగిందన్నారు. రైతులకు బాగా ఉపయోగపడతాదని అన్నారు. వ్యవసాయానికి, త్వరలో ఆక్వా రంగానికి సంబంధించి రైతులు ఎటువంటి పరీక్షలనైనా ఉచితంగా చేయించుకోవచ్చని అన్నారు. ప్రజలు ఆరోగ్యం గా ఉండాలంటే ఆర్గానిక్ వెజిటబుల్స్ కల్చర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో ఆరోగ్య వంతమైన కూరగాయలను ప్రజలకు అందించేలా ప్రతి మండలంలోనూ ఒక ప్రాంతంలో ఆర్గానిక్ కూరగాయలు విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ రకంగా చేయటం వలన ఆర్గానిక్ రైతులకు సహకారం అందించినట్లు జరుగుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె .ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏడి సజీవ ప్రతాప్, మండల వ్యవసాయ శాఖ అధికారులు నులి శ్రీనివాస్, రమేష్ నాయుడు, సంధ్య, ప్రియదర్శిని, మార్కెట్ యార్డ్ సెక్రటరీ నలబా మావుళ్ళు, ఏఎంసీ చైర్మన్ కె.రామచంద్రరాజు, పాలకోడేరు సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, ప్రజా ప్రతినిధులు జుత్తిగ నాగరాజు, కరిమేరకు నాగరాజు, గ్రామ సర్పంచ్ రైతులు, తదితరులు పాల్గొన్నారు.