Close

జూన్ 19న ఐదువేల మందితో డిఎన్ఆర్ కాలేజీలో భారీ యోగా ప్రదర్శన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 17/06/2025

యోగ వేదికను డిఎన్ఆర్ కాలేజీకి మార్పు..

యోగ అభ్యసన కార్యక్రమంలో పాల్గొననున్న అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్ ..

భీమవరం పట్టణంలో జూన్ 19న 5 వేల మందితో మెగా యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

మంగళవారం భీమవరం డిఎంఆర్ కాలేజ్ గన్నా బత్తుల క్రీడా మైదానాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా భీమవరం నందు జూన్ 19న మెగా యోగ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మెగా యోగా ఈవెంట్ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. యోగ కార్యక్రమంలో అథ్లెటిక్స్, స్పోర్ట్స్ గ్రూప్స్, యూత్ గ్రూప్స్ 5 వేల మంది పైబడి పాల్గొననున్నట్లు తెలిపారు. యోగ అభ్యాసనాలను నిర్వహించేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లును త్వరితగతి పూర్తిచేయాలని అధికారులును ఆదేశించారు.

ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్టీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఎ.రాంబాబు, టౌన్ సర్వేయర్ ఎస్.రమాబాయి, తహసిల్దార్ రావి రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.