జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ షాపుల వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు
బుధవారం పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో రేషన్ షాపు నెంబర్.0537011 ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. జూన్ ఒకటో తేదీ నుండి రేషన్ షాపులు వద్దని నిత్యవసర సరుకులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాలకోడేరు మండలం శృంగ వృక్షం రేషన్ షాపును జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తగిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుండి ప్రభుత్వం పేదలకు నిత్యవసర సరుకులు రేషన్ షాపులు వద్దనే ఇచ్చుటకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో జిల్లాలోని కార్డుదారులందరూ రేషన్ షాపులు వద్దకు వచ్చి నిత్యవసర సరుకులను తీసుకోవాలని అన్నారు. జూన్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కార్డుదారులు వారికి అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు పొందవచ్చునని తెలిపారు. అయితే వికలాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులను అందజేయాలని డీలర్లను ఆదేశించారు.
ఈ సందర్భంలో డీఎస్ఓ ఎన్ సరోజ, ఏ ఎస్ ఓ ఎం రవిశంకర్, సి ఎస్ డి టి ఆదిశేషయ్య నాయుడు, తదితరులు ఉన్నారు.
