• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

జీరో పోవర్టీ సమాజ నిర్మాణానికి స్థితిమంతులు ముందుకు రావాలి-జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 28/07/2025

జిల్లాలో మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాలకు అనుసంధానం వేగవంతం చేయాలి.

పి-4 గ్రామ సభలను నూరు శాతం త్వరితగతిన పూర్తి చేయాలి.

పి4 లో భాగంగా మార్గదర్శకుల నమోదు, బంగారు కుటుంబాల అనుసంధానం అంశంపై సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గం, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 1,623 మంది మార్గదర్శకులుగా నమోదు కావడం జరిగిందని, 35,831 మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. సమాజంలో మార్గదర్శకులు బంగారు కుటుంబాలని దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. మన జిల్లాకు సంబంధించి సంపన్నులు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు చాలామంది ఉన్నారని వారిని గుర్తించి పి.4 ఉద్దేశాన్ని అవగాహన కల్పించి మార్గదర్శకులుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో మార్గదర్శకులుగా నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల, మండలాల పరిధిలోని స్థితిమంతులైన వ్యాపారవేత్తలు పెద్ద రైతులు, పారిశ్రామికవేత్తలు, రైస్ మిల్లర్స్ విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు ప్రైవేటు సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలను ఆయా శాఖలకు సంబంధించి అధికారులు వారిని కలిసి పి.ఫోర్ ఉద్దేశాన్ని, ప్రభుత్వ లక్ష్యాన్ని వారికి అవగాహన కల్పించి స్వచ్ఛందంగా మార్గదర్శకులుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు. అదేవిధంగా అర్హులైన బంగారు కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ కె.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డ్వామా పి.డి కేసిహెచ్ అప్పారావు, డి ఆర్ డి ఏ పి డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిఇఓ ఈ నారాయణ జిల్లా పరిశ్రమలశాఖ అధికారి యు.మంగపతి రావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.