Close

జీఎస్టీ తగ్గింపును అమలు చేయకపోతే చర్యలు తప్పవు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 29/09/2025

జిఎస్టి తగ్గింపుపై నేటి నుండి అక్టోబర్,19వ తేదీ వరకు జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు

ఇంటింటికి వెళ్లి జిఎస్టి తగ్గింపు పై ప్రతీ కటుంటుంబానికి తెలియజేయాలి

జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డ్ సచివాలయ స్థాయిలో జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన

జిఎస్టి తగ్గింపుకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత బిల్లుతో పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించవచ్చు..

జిల్లాలో సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ పై జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.

సూపర్ జిఎస్టి .. సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం ప్రచారంలో “గృహ పొదుపు” కార్యక్రమాన్ని సోమవారం భీమవరం 32వ వార్డ్ ఎడ్వర్డ్ ట్యాంక్ మీటింగ్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జీఎస్టీ నోడల్ అధికారి టి.రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించి, జీఎస్టీ తగ్గిన వస్తువుల ప్రదర్శనను తిలకించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో తీసుకువెళ్లడానికి ముఖ్యంగా జిఎస్టి తగ్గింపు శుభపరిణామం అన్నారు. దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలి ప్రజలకి సేవింగ్ పెరగడానికే ఈ కార్యక్రమం అన్నారు. ప్రజలకి జిఎస్టి 2.0 వలన ప్రయోజనాలనుపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం వలన ప్రజలకు ఉపయోగం ఏంటి, జీఎస్టీ రేట్లు తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమలుకు వచ్చిన విషయాలు కూడా ప్రజలకు తెలియ చెప్పాలన్నారు. నేటి నుండి అక్టోబర్,19 వరకు జిల్లాలో “సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్” పేరుతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జీఎస్టీ 2.O కింద ప్రజలకు కలిగే లబ్ధిపై పూర్తి అవగాహన కార్యక్రమాలు జిల్లాలో 4 వారాల పాటు నిర్వహించాలని జీఎస్టీ అధికారులతో కలిసి మిగిలిన శాఖ అధికారులు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు నిత్యం వినియోగించే నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గింపుతో ఏ మేరకు లబ్ది కలుగుతుందోనని ప్రతీ ఇంటింటికి వెళ్లి తెలియజేయాలన్నారు. నాలుగు వారాల పాటు ప్రతీ వారం ఒక థీమ్ తీసుకుని ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. వినియోగదారుడు ప్రతి వస్తువుకు బిల్లును తప్పక అడిగి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన జీఎస్టీకి మించి వసూలు చేస్తే సంబంధిత ఫిర్యాదులను బిల్లుతో సహా పి జి ఆర్ ఎస్ నందు అందచేయవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ శ్రీ, భీమవరం మున్సిపాలిటీ సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, వాణిజ్య పన్నుల శాఖ భీమవరం, తణుకు, సర్కిల్స్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు వి.కేదారేశ్వర రావు, కె.వి.శ్రీనివాసరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.