• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు సంబంధిత శాఖలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 30/08/2025

శనివారం భీమవరం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో “పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ వెర్షన్ 2.0 పై (పిఎఐ 2.0) నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్” కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవాభివృద్ధికి 193 దేశాలు కూడుకొని ఒక సూచికను రూపొందించడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక దేశాలలో కొన్ని అంశాల్లో అభివృద్ధి చెందినప్పటికీ, భారతదేశ ఆర్థికంగా మూడో స్థానంలో ఉందని తెలిపారు. సూపర్ పవర్ గా ఎదగాలంటే లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేదరికం కారణంగా ఆకలి, స్త్రీ పురుష సమానత్వం, అందరికీ ప్రాథమిక విద్య, వైద్యం, తదితర అంశాలలో బేసిక్ లక్ష్యాలను పెట్టుకొని లక్ష్యసాధనకు ముందుకు వెళ్లాలన్నారు. సుస్థిర అభివృద్ధి అనేది మానవ, సామాజిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉందన్నారు. లక్ష్యాల సాధనకు సంబంధిత శాఖల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొట్టమొదటి బేస్‌లైన్ పంచాయతీ అభివృద్ధి సూచిక స్థానిక లక్ష్యాలను నిర్దేశించడంలో, కార్యాచరణ అంశాలను గుర్తించడంలో, కావలసిన లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశించిన ఆధారాల ఆధారిత పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సూచిక గ్రామీణ భారతదేశ అవసరాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. 2025 – 26 వార్షిక ప్రణాళికలో భాగంగా నేడు నిర్వహించుకుంటున్న వర్క్ షాప్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్ యొక్క అవగాహన మరియు అమలును మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక శిక్షణా కార్యక్రమం అన్నారు. జాతీయ మరియు జిల్లా స్థాయిలో జరిగే ఈ వర్క్‌షాప్‌లు, పంచాయతీ రాజ్ సంస్థలలో పారదర్శక, డేటా ఆధారిత మరియు జవాబుదారీ పాలన కోసం డేటాను సేకరించడం మరియు అప్‌లోడ్ చేయడంపై ప్రభుత్వ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫేస్‌బుక్ పోస్ట్, ఖచ్చితమైన డేటా సేకరణ, పిఎఐ పోర్టల్ వాడకం, అన్ని స్థాయిలలోని భాగస్వామ్యుల సామర్థ్య నిర్మాణం ద్వారా స్థానిక పాలనను మెరుగుపరచడంపై దృష్టి సాధించడం జరుగుతుందన్నారు. డేటా ఆధారిత పాలనను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల పారదర్శక, జవాబుదారీతనం, సమగ్ర అభివృద్ధి కోసం ఖచ్చితమైన, నమ్మదగిన డేటాను ఉపయోగించడం జరుగుతుందన్నారు.

వర్క్ షాప్ లో జిల్లా పంచాయతీ అధికారి రామనాథ్ రెడ్డి, డ్వామా పి.డి కే సిహెచ్ అప్పారావు, హౌసింగ్ పీడీ జి.పిచ్చయ్య, ఐ సి డి ఎస్ పిడి డి.శ్రీలక్ష్మి, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ జాన్సన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, జడ్పిటిసి లు, డిప్యూటీ ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.