Close

జిల్లా వ్యాప్తంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను వర్మీ కంపోస్ట్ గా తయారీకి చర్యలు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 22/09/2025

రొయ్యల చెరువులలో వర్మీ కంపోస్ట్ ను వాడి అధిక దిగుబడులను పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన వర్మీ కంపోస్ట్ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సందర్శించి, ప్రారంభించారు. అనంతరం కిలో ఒక్కింటికి రూ.10/- చొప్పున చెల్లించి కొనుగోలు చేసిన రైతులకు 4.5 టన్నుల వర్మీ కంపోస్ట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ సచివాలయాల ద్వారా కిలో పది రూపాయల చొప్పున చెల్లించి కావలసినవారు వర్మీ కంపోస్ట్ ను పొందవచ్చునని అన్నారు. అలాగే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో వర్మీ కంపోస్ట్ స్టాల్ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. రొయ్యల చెరువుల్లో వర్మికంపోస్ట్ వాడటం వల్ల నీటి నాణ్యత మెరుగుపడుతుందని అన్నారు. పోషకాలు అంది నీటిలో సహజ సిద్ధమైన సూక్ష్మజీవులు కార్యకలాపాలు పెరుగుతాయని తద్వారా రసాయన ఎరువులు వాడకం తగ్గుతుందని అన్నారు.
వర్మీ కంపోస్ట్ వలన రొయ్యలు పెరుగుదల మెరుగుపడి దిగుబడి పెరుగుతుందని అన్నారు. ఇది నీటి మరియు పోషకాలను నిలిపే సామర్థ్యాన్ని కూడా పెంచి చెరువులోని జీవవైవిద్యాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. వర్మీ కంపోస్ట్ కావలసిన వారు గ్రామంలోని సచివాలయాల ద్వారా పొందవచ్చునని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రామ్ నాథ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.