జిల్లా ప్రజల అవసరాలకు స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచిన ఇసుక నిల్వలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

జిల్లాలో ఇసుక రీచ్ లు అందుబాటులో లేనందున జిల్లాస్థాయి ఇసుక కమిటీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తీపర్రు-2 ఇసుక రీచ్ నుండి ఇసుకను ఆచంట, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రాలకు ఇసుక తరలించి, స్టాక్ పాయింట్ ద్వారా అమ్మకాలు చేపట్టడానికి నిర్ణయించి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం జరిగిందన్నారు.
@ ఆచంటలో మెట్రిక్ టన్ను ఒక్కింటికి రూ.295/- లు చెల్లించి ఇసుకను పొందవచ్చు అని, ప్రస్తుతం 200 మెట్రీక్ టన్నులు స్టాక్ పాయింట్ నందు అందుబాటులో ఉందన్నారు. ఆచంట స్టాక్ పాయింట్ ను కే వి వి ఎస్ ఎన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహిస్తున్నారని స్టాక్ పాయింట్ ఇంచార్జ్ లు సెల్ నెంబర్లు.. 95506 28544, 93918 11436 నందు సంప్రదించవచ్చన్నారు.
@పాలకొల్లులో మెట్రిక్ టన్ను ఒక్కింటికి రూ.320/- లు చెల్లించి ఇసుకను పొందవచ్చు అని, ప్రస్తుతం 220 మెట్రీక్ టన్నులు స్టాక్ పాయింట్ నందు అందుబాటులో ఉందన్నారు. పాలకొల్లు స్టాక్ పాయింట్ ను మైత్రి ఇన్ఫ్రా వారు నిర్వహిస్తున్నారని స్టాక్ పాయింట్ ఇంచార్జ్ లు సెల్ నెంబర్లు.. 99892 41197, 91771 15571 ల నందు సంప్రదించవచ్చన్నారు.
@తాడేపల్లిగూడెంలో మెట్రిక్ టన్ను ఒక్కింటికి రూ.300/- లు చెల్లించి ఇసుకను పొందవచ్చు అని, ప్రస్తుతం 100 మెట్రీక్ టన్నులు స్టాక్ పాయింట్ నందు అందుబాటులో ఉందన్నారు. తాడేపల్లిగూడెం స్టాక్ పాయింట్ ను శ్రీ దుర్గా కన్స్ట్రక్షన్స్ వారు నిర్వహిస్తున్నారని స్టాక్ పాయింట్ ఇంచార్జ్ లు సెల్ నెంబర్లు.. 63030 25769, 82472 30369 ల నందు సంప్రదించవచ్చన్నారు.
@తణుకులో మెట్రిక్ టన్ను ఒక్కింటికి రూ.215/- లు చెల్లించి ఇసుకను పొందవచ్చు అని, ప్రస్తుతం 20 మెట్రీక్ టన్నులు స్టాక్ పాయింట్ నందు అందుబాటులో ఉందన్నారు. తణుకు స్టాక్ పాయింట్ ను శ్రీ వర్ధన్ కన్స్ట్రక్షన్స్ వారు నిర్వహిస్తున్నారని స్టాక్ పాయింట్ ఇంచార్జ్ లు సెల్ నెంబర్లు.. 86888 18124, 93900 69686 ల నందు సంప్రదించవచ్చన్నారు.
@నరసాపురంలో మెట్రిక్ టన్ను ఒక్కింటికి రూ.370/- లు చెల్లించి ఇసుకను పొందవచ్చు అని, ప్రస్తుతం 160 మెట్రీక్ టన్నులు స్టాక్ పాయింట్ నందు అందుబాటులో ఉందన్నారు. నరసాపురం స్టాక్ పాయింట్ ను మైత్రి ఇన్ఫ్రా వారు నిర్వహిస్తున్నారని స్టాక్ పాయింట్ ఇంచార్జ్ లు సెల్ నెంబర్లు.. 88972 37839, 93467 12492 ల నందు సంప్రదించవచ్చన్నారు.
@ఉండిలో మెట్రిక్ టన్ను ఒక్కింటికి రూ.440/- లు చెల్లించి ఇసుకను పొందవచ్చు అని, ప్రస్తుతం 200 మెట్రీక్ టన్నులు స్టాక్ పాయింట్ నందు అందుబాటులో ఉందన్నారు. ఉండి స్టాక్ పాయింట్ ను మైత్రి ఇన్ఫ్రా వారు నిర్వహిస్తున్నారని స్టాక్ పాయింట్ ఇంచార్జ్ లు సెల్ నెంబర్లు.. 95152 30498, 94929 39276 ల నందు సంప్రదించవచ్చన్నారు.
ఇసుక కావలసిన వినియోగదారులు తమ వివరాలను sand.ap.giv.in వెబ్సైట్లో నమోదు చేసుకొని, రిజిస్ట్రేషన్ కాపీని ఇసుక నిల్వ కేంద్రం వద్ద చూపించి ఇసుకను పొందవచ్చని లేదా నేరుగా ఇసుక నిలువ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డును చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అన్నారు. అప్పుడు స్టాక్ పాయింట్ ఇంచార్జ్ డిజిటల్ పేమెంట్ చేయించుకుని ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.