జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సుందరీకరణకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు
బుధవారం భీమవరం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులకు, పాస్ పోర్ట్ కార్యాలయానికి వచ్చేవారికి షెల్టర్ ఏర్పాటు, జువ్వలపాలెం రోడ్డు అడ్డ వంతెన సమీపంలో బస్ షెల్టర్, ఏ ఎస్ ఆర్ నగర్ వాటర్ ట్యాంక్ ఆవరణలోని పార్కు అభివృద్ధికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలను జారీ చేశారు. ఏ ఎస్ ఆర్ నగర్ లో హెడ్ వాటర్ ట్యాంక్ ఆవరణలో పార్కు సుంద్రీకరణ చేయుటకు ప్రణాళిక సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిని ఆదేశించారు. జువ్వలపాలెం రోడ్డు అడ్డ వంతెన వద్ద ప్రయాణికులు కొరకు బస్సు షెల్టర్ ను ఏర్పాటు చేయుట ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. అలాగే భీమవరం పాత బస్టాండు ప్రయాణికులు కొరకు మరియు సమీపంలో ఉన్న పాస్ పోర్ట్ కార్యాలయమునకు సుదీర్ఘ ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారని వారు వేచి ఉండుటకు షెల్టర్ నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జెసి మున్సిపల్ శాఖ అధికారులును ఆదేశించారు. అనంతరం దశాబ్దకాలం నుండి పాత బస్టాండ్ లో ప్రయాణికులు ఉపయోగించే బాత్ రూములను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబదిత శాఖల అధికారులును ఆదేశించారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఈ.ఈ త్రినాధ రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీలక్ష్మి, డి ఈ అప్పారావు, టౌన్ ప్లానింగ్ అధికారి, తదితరులు ఉన్నారు.