జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్నికల వ్యయ పరిశీలకులు అహ్మద్ అబ్దుల్ రావుప్ షేక్. ఎన్నికల వ్యయాల పర్యవేక్షణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించిన అహ్మద్ అబ్దుల్ రావుప్ షేక్ సోమవారం భీమవరంలోని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఆమె ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల వ్యయాల పర్యవేక్షణ, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన నిబంధనల అమలు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు సమన్వయంతో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం ద్వారా ఎన్నికల సమయంలో అభ్యర్థులు చేసే ఖర్చులపై నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షణ చేపట్టేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని అన్నారు.
ఎన్నికల వ్యయాలకు సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు చేపట్టనున్నామన్నారు.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందన్నారు.