జిల్లా అంతటా 2,21,359మంది లబ్ధిదారులకు రూ.96.77 కోట్లు పింఛన్లు పంపిణీ
ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.
……జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం పట్టణం 16వ వార్డు అయ్యవారి వీధిలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను ఆపాయ్యతగా పలకరించి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందుతున్నాయా, పింఛన్ అందిస్తున్న సమయంలో సిబ్బంది గౌరవప్రదంగా ఇస్తున్నారా అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్బంగా పర్వతవర్ధనమ్మ వృద్ధ మహిళ స్వయంగా తయారు చేసిన వడియాలును రుచి చూడమని జిల్లా కలెక్టర్ కు ప్రేమ పూర్వకంగా బహుకరించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పీ.డి ఎం.ఎస్.ఎస్. వేణుగోపాల్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.